ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. 24 పరుగుల తేడాతో గెలుపొందింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై.. 18.5 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌటైంది. కేకేఆర్ బౌలర్లు విజృంభణతో ముంబై చిత్తుగా ఓడిపోయింది. ముంబై బ్యాటింగ్లో సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే (56) రన్స్ చేశాడు. మిగతా బ్యాటర్లంతా రాణించలేకపోయారు. ముంబై బ్యాటింగ్లో ఓపెనర్లు ఇషాన్ కిషన్ (13), రోహిత్ శర్మ (11) పరుగులు చేశారు. ఆ తర్వాత నమన్ ధీర్ (11) రన్స్ చేశాడు. తిలక్ వర్మ (4) పరుగులు చేసి నిరాశపరిచాడు.
Off The Record : తెలంగాణ బీజేపీ నేతలపై Amit Shah Silence కి కారణం ఏంటి ? మారారా ? వదిలేశారా ?
నేహల్ వధేరా (6), కెప్టెన్ హార్ధిక్ పాండ్యా (1) పరుగులు చేశారు. ఆ తర్వాత టిమ్ డేవిడ్ (24), కోయెట్జీ (8), పీయూష్ చావ్లా డకౌట్ అయ్యాడు. కోల్కతా బౌలింగ్లో చివరి ఓవర్లో మిచెల్ స్టార్క్ చెలరేగాడు. 3 వికెట్లు తీసి ముంబై గెలుపుకు అడ్డుకట్ట వేశాడు. మొత్తం అతని బౌలింగ్ లో 4 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, రస్సెల్ అద్భుతంగా బౌలింగ్ చేసి తలో రెండు వికెట్లు పడగొట్టారు.
Pawan kalyan: నెల్లూరు ప్రజలు ఇంత ప్రేమ చూపిస్తారను కోలేదు
అంతకుముందు బ్యాటింగ్ చేసిన కోల్కతా.. 169 పరుగులు చేసింది. కోల్కతా బ్యాటింగ్లో వెంకటేష్ అయ్యర్ (70), ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన మనీష్ పాండే (42) పరుగులతో రాణించారు. ఓపెనర్లలో ఫిల్ సాల్ట్ (5), సునీల్ నరైన్ (8) పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టారు. ఆ తర్వాత బరిలోకి వచ్చిన రఘువంశీ (13), శ్రేయాస్ అయ్యర్ (6) పరుగులు చేసి నిరాశ పరిచారు. ఫినిషర్ రింకూ సింగ్ (9) ఆకట్టుకోలేకపోయాడు. రస్సెల్ (7) పరుగులు చేసి రనౌట్ రూపంలో ఔటయ్యాడు. రమన్ దీప్ సింగ్ (2), మిచెల్ స్టార్క్ డకౌట్ అయ్యాడు. ముంబై బౌలింగ్ లో బుమ్రా, నువాన్ తుషార్ చెరో 3 వికెట్లతో చెలరేగారు. ఆ తర్వాత కెప్టెన్ హార్ధిక్ పాండ్యా కూడా 2 వికెట్లతో ఆకట్టుకోగా, పీయూష్ చావ్లా ఒక వికెట్ పడగొట్టాడు.