Anna Rambabu: ఈ ఎన్నికల్లో మంచిని గ్రహించి ఓటేయాలి.. జగనన్న రెండోసారి ముఖ్యమంత్రి చేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆదివారం మార్కాపురం మండలం కొండేపల్లి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. తాను రెండుసార్లు గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచెనని, ఇప్పుడు జగనన్న ఆదేశాల మేరకు మార్కాపురంలో పోటీ చేస్తున్నానని తెలిపారు. మీ అందరి ఆశీస్సులతో తనను గెలిపించాలని, మీకు సేవ చేసే భాగ్యాన్ని ఇవ్వాలని అక్కడి ప్రజలను కోరారు. జగన్ పాలనలో అందించిన సంక్షేమ పథకాలు అందరికి అందాయన్నారు.
Geetha Bhagath: హీరో కడతాడని చీర కట్టుకు రాలేదు.. యాంకర్ షాకింగ్ కామెంట్స్
Also Read
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
చంద్రబాబు ఎన్నికల ముందు ఎన్నో హమీలు ఇస్తున్నారని, ఎన్నికల తర్వాత వాటన్నింటిని మరిచిపోయి ప్రజలను మోసం చేస్తారని అన్నా రాంబాబు ఆరోపించారు. మళ్లీ ఎన్నికల వేళ వస్తున్నారని, ఆయన ఇచ్చే హామీలను ఏవీ నమ్మద్దొని, నమ్మి మోసపోవద్దని సూచించారు. జగనన్న రెండోసారి ముఖ్యమంత్రి అయితేనే మీ కుటుంబాలు సంతోషంగా ఉంటాయని, పిల్లల భవిష్యత్ బాగుంటుందని తెలిపారు. అందరూ కూడా ఈ ఎన్నికల్లో మంచిని గ్రహించి ఓటేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని అన్నా రాంబాబు కోరారు.
Prajwal Revanna case: బాధితుల కోసం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసిన సిట్.. నెంబర్ ఇదే!
పేదలందరికి మంచి జరగాలంటే… జగన్‌ను మళ్లీ సీఏం చేయాలన్నారు. పేదల ముంగిట్లోకి వచ్చిన సంక్షేమం, అభివృద్ది కొనసాగాలంటే మళ్లీ జగన్ రావాలన్నదే మన ఆకాంక్ష అన్నారు. ఓటు అనే ఆయుధంతో అవ్వాతాతలు రానున్న ఎన్నికల్లో జగనన్నను ఆశీర్వదించండని, రాష్టంలో పింఛన్‌దారులను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిని తరిమి కొట్టాలని ఆయన అన్నారు. పింఛన్ దారుల పడుతున్న ఇబ్బందులపై ప్రజలందరూ ఆలోచన చేయాలని కోరారు. 2019 నుంచి జగన్ సర్కారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేసిందని ఆయన చెప్పారు. వాలంటీర్ వ్యవస్థ మీద మొదటి నుంచి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ఈర్ష్య, ద్వేషాలు ఉన్నాయన్నారు.
తాజావార్తలు
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
-
OTR: వివాదాస్పదంగా తంబళ్ళపల్లె టీడీపీ ఇన్చార్జి వైఖరి..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!