ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీల నేతలు ప్రచారంలో జోరు పెంచారు. ఏపీలో అధికార వైసీపీ ప్రచారంలో దూసుకెళ్తోంది. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అందరి ఫోకస్ తుని అసెంబ్లీ నియోజకవర్గంపైనే ఉంది. ఈ ప్రతిష్ఠాత్మక సెగ్మెంట్‌లో మరోసారి విజయకేతనం ఎగరవేయాలని అధికార వైసీపీ ఆశిస్తోంది. గెలుపు కోసం ఆ పార్టీ అభ్యర్థి, మంత్రి దాడిశెట్టి రాజా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు మంత్రి దాడిశెట్టి రాజా. మరోవైపు.. తన గెలుపు కోసం తనయుడు ప్రచారం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దాడిశెట్టి సతీమణి ప్రచారం నిర్వహిస్తున్నారు.
Vijay Deverakonda: రష్మికతో దేవరకొండ సినిమా.. కథ మామూలుగా ఉండదు!
కాకినాడ జిల్లా తునిలో భర్త గెలుపుకోసం భార్య లక్ష్మీచైతన్య ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. తన భర్త తుని వైసీపీ అభ్యర్థి మంత్రి దాడిశెట్టి రాజాకి ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నారు. తుని మండలంలోని వల్లూరు, అగ్రహారం, సీతయ్యపేట గ్రామాలలో ఇంటింటికి వెళ్లి లక్షీచైతన్య ఎన్నికల ప్రచారాన్ని చేసారు. ఈ సందర్భంగా లక్ష్మీచైతన్య మాట్లాడుతూ.. మంత్రి దాడిశెట్టి రాజాని ముచ్చటగా మూడోసారి గెలిపించుకోడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సీఎం జగన్ చేసిన సంక్షేమ పథకాలే మళ్లీ వైసీపీని అధికారంలోకి తీసుకువస్తాయని లక్షీచైతన్య ధీమా వ్యక్తం చేసారు. తాను ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. ప్రజలంతా ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
Kulgam Encounter: కుల్గాంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య మరో ఎన్‌కౌంటర్..