ముంబైలోని ఘట్ కోపర్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా 100 అడుగుల హోర్డింగ్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకు 16 మంది చనిపోయారు. బిల్ బోర్డు శిథిలాలు తొలగిస్తుండగా కారులో రెండు మృతదేహాలు బయటపడ్డాయి. వారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రిటైర్డ్ మేనేజర్ మనోజ్ చన్సోరియా, ఆయన భార్య అనితగా గుర్తించారు.
Read Also: CM Revanth Reddy: రాష్ట్ర ఆదాయం పెంపుపై ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు
కాగా.. సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పెట్రోల్ బంక్ పక్కన ఉన్న ఈ బిల్ బోర్డు కూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికక్కడే 14 మంది మృతి చెందారు. ఈ శిథిలాలను తొలగిస్తున్న క్రమంలో బుధవారం రాత్రి కారులో భార్యాభర్తల మృతదేహాలను గుర్తించారు. కాగా.. మనోజ్ చన్సోరియా రెండు నెలల క్రితమే పదవీ విరమణ చేశారు.
Read Also: Central Election Commission: ఏపీలో హింసాత్మక ఘటనలు.. చర్యలకు దిగిన సీఈసీ
తర్వాత వారు ముంబై నుంచి జబల్‌పూర్‌కు వెళ్లారు. అయితే.. వీసా కోసమని కొన్నిరోజుల క్రితం ముంబైకు వచ్చినట్లు బంధువులు తెలిపారు. అయితే.. ఆ పని పూర్తి కాగా.. తిరిగి జబల్‌పూర్ వెళుతున్నారు. ఈ క్రమంలో పెట్రోల్ బంకులో పెట్రోల్ పోసుకునేందుకు బంక్ లోకి వెళ్లగా.. ఆ సమయంలో బిల్ బోర్డు కూలి కారు మీద పడింది. ఈ ప్రమాదంలో వారు మృతి చెందారు.