Slovakia PM: స్లోవేకియా ప్రధానిపై కాల్పుల ఘటన.. వీడియో చూశారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుధవారం స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోపై దుండుగుడు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కాల్పుల్లో ప్రధాని గాయపడగా.. తృటిలో ప్రాణాపాయం తప్పింది. అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాని రాబర్ట్ ఫికోపై కాల్పులు జరిపిన తర్వాత, ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈశాన్యంగా 150కి.మీ దూరంలో ఉన్న హ్యాండ్‌లోవా పట్టణంలోని తన మద్దతుదారులతో మాట్లాడుతున్న సమయంలో హౌజ్ ఆఫ్ కల్చర్ వెలుపల ఈ దాడి జరిగింది. నాలుగు రౌండ్లు కాల్పులు జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
Medical Negligence: వైద్యుల నిర్లక్ష్యం.. చిన్నారి చేతికి బదులు నాలుకకు శస్త్రచికిత్స..
Also Read
- Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
- Muhammad Yunus: "నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు".. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
కాగా.. ప్రధాని రాబర్ట్ ఫికోపై కాల్పులకు పాల్పడిన నిందితుడి వీడియో బయటికొచ్చింది. కాల్పులు జరిపిన అనంతరం.. సెక్యూరిటీ గార్డులు నిందితుడిని కారులో ఎక్కించి తీసుకెళ్లారు. కాల్చి పారిపోతుండగా నిందితుడిని అక్కడున్న కొంతమంది పట్టుకున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. స్లోవాక్ మీడియా నుండి అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఫికోపై చాలాసార్లు కాల్పులకు పాల్పడ్డాడు. పొట్టపై ఒకసారి, తలపై ఒకసారి కాల్చాడు. ఈ క్రమంలో.. ప్రధాని రాబర్ట్ ఫికో పరిస్థితి విషమంగా ఉంది. ప్రధాని రాబర్ట్ ఫికోపై దాడి జరిగిన తర్వాత.. ప్రత్యక్ష సాక్షులు దాడి చేసిన వ్యక్తిని పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
Lightning Strike: పిడుగుల బీభత్సం.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు
ఫికోపై దాడిని పలువురు నేతలు ఖండించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఇది పిరికిపంద చర్య అని అభివర్ణించారు. రాబర్ట్ ఫికో త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. స్లోవేకియాకు భారత్ సంఘీభావంగా నిలుస్తుందని ప్రధాని మోడీ తెలిపారు. మరోవైపు, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ కూడా ఈ ఘటనను ఖండించారు. ఈ ఘటనతో తాము దిగ్భ్రాంతికి గురయ్యామని చెప్పారు. ఈ భయంకరమైన వార్త విని షాక్ అయ్యానని సునక్ చెప్పారు.
⚡️⚡️⚡️ The first minutes after the attack on Robert #Fico – the prime minister's security guards evacuate him to his motorcade while eyewitnesses hold the shooter
According to preliminary information from Slovak media, Fico was shot multiple times. One to the abdomen, one to the… pic.twitter.com/vhcYPPjjlg
— NEXTA (@nexta_tv) May 15, 2024
తాజావార్తలు
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Muhammad Yunus: “నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు”.. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
-
Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
-
Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
-
Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!