రోడ్డు ప్రమాదాల గురించి పోలీసులు ఎన్ని నివారణ చర్యలు చేపట్టినప్పటికీ.. ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. అతి వేగం మనుషుల ప్రాణాలను బలికొంటుంది. ఈ క్రమంలో.. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన బైక్ చెట్టును ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మేరకు ఆదివారం పోలీసులు సమాచారం అందించారు. శనివారం రాత్రి లైలుంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రహన్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు.
మెట్రో రైళ్లు అంటేనే నిత్యం నగరవాసులతో రద్దీగా ఉంటాయి. ఇక ఆ మెట్రో రైళ్లలో కొందరు ప్రవర్తించే తీరు ఇతర ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. గతంలో వెలుగులోకి వచ్చిన ఘటనలు మరిచిపోకముందే.. తాజాగా మరో సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక.. ఢిల్లీ మెట్రో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కడా చేయని రీల్స్.. ఇక్కడ మాత్రం చేస్తూ వైరల్ అవుతూ ఉంటాయి. అయితే.. తాజాగా ఒక యువతి డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంది. ఆ యువతి వేసే డ్యాన్స్ స్టెప్పులు చూసి జనాలు…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రెండు మ్యాచ్లు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్.. భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 214 పరుగులు సాధించారు. పంజాబ్ బ్యాటింగ్లో అత్యధికంగా ప్రభ్సిమ్రాన్ సింగ్ (71) పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 4 సిక్సులు, 7 ఫోర్లు ఉన్నాయి. ఆ తర్వాత అథ్వారా థైడే (46), రిలీ రోసో (49) పరుగులతో రాణించారు.
రేపు లోక్ సభ ఎన్నికలకు సంబంధించి పలు రాష్ట్రాల్లో ఐదో దశ ఓటింగ్ జరుగనుంది. అందుకు సంబంధించి ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. కాగా.. ఐదో విడత పోలింగ్‌కు ముందు ఓటర్లకు ఈసీ ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. ఓటర్లు భారీ సంఖ్యలో పాల్గొని ఓటు వేయాలని కోరింది. ముఖ్యంగా పట్టణ ప్రజలకు ఎన్నికల సంఘం ప్రత్యేక అభ్యర్థన చేసింది. ముంబై, థానే, లక్నో వంటి నగరాల్లో గత ఎన్నికల్లో ఓటింగ్ పట్ల తేడా కనిపించిందని కమిషన్ చెబుతోంది.
రోహిత్ శర్మ తన స్నేహితులతో మాట్లాడుతున్న వీడియో వైరల్‌గా మారింది. ముంబై మాజీ ఫాస్ట్ బౌలర్ ధావల్ కులకర్ణితో రోహిత్ మాట్లాడాడు. ఇంతలో కెమెరామెన్ వారి సంభాషణను రికార్డ్ చేయడం రోహిత్ చూశాడు. కాగా.. ఆ ఆడియోను రికార్డ్ చేయవద్దని రోహిత్ చేతులు జోడించి విజ్ఞప్తి చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో.. రోహిత్ శర్మ స్టార్ స్పోర్ట్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
చైనీస్ యాజమాన్యంలోని బ్రిటిష్ వాహన తయారీ సంస్థ MG మోటార్స్ భారతదేశంలో అనేక గొప్ప ఫీచర్లతో SUVలు మరియు కార్లను అందిస్తోంది. దేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు MG కామెట్ EVని కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఎవరికి ఉత్తమ ఎంపిక అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఐపీఎల్ 2024లో భాగంగా.. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. 27 పరుగుల తేడాతో గెలుపొందింది. 219 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన సీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లలో 191 పరుగులు చేసింది. దీంతో చెన్నై ఓడిపోయింది. ఈ క్రమంలో.. ఆర్సీబీ ప్లేఆఫ్స్లోకి దూసుకెళ్లింది. చెన్నై బ్యాటింగ్లో చివర్లో జడేజా (42*) పరుగులతో ఆదుకున్నప్పటికీ చివరికి ఓటమిపాలైంది. ధోనీ కూడా (25) పరుగులతో రాణించాడు.
వెల్లుల్లి ఆహారం రుచిని పెంచడమే కాకుండా దానిని పురాతన కాలం నుంచి ఆయుర్వేద ఔషధంగా ఉపయోగిస్తున్నారు. అయితే వెల్లుల్లి తొక్కలను మీరు పనికిరావని భావించి పారేస్తున్నారా.. ఇక నుంచి తెలుసుకోండి వెల్లుల్లి లాగానే వెల్లుల్లి తొక్కలతో కూడా మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వెల్లుల్లి పీల్స్‌లో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ-వైరస్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. దీనిని సూప్‌లు, కూరగాయలలో వాడవచ్చు. వెల్లుల్లి తొక్కల వల్ల ఉబ్బసం, పాదాలలో వాపును తగ్గించడంలో సహాయపడతాయి. వెల్లుల్లి తొక్కల వల్ల చాలా ప్రయోజనాలు…
ఐపీఎల్ 2024లో భాగంగా.. చెన్నైతో జరుగుతున్న కీలక మ్యాచ్ లో ఆర్సీబీ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది బెంగళూరు. చెన్నై ప్లే ఆఫ్స్ కు వెళ్లాలంటే 219 పరుగుల టార్గెట్ ను చేధించాలి. బెంగళూరు బ్యాటింగ్ లో అందరూ సమిష్టిగా రాణించారు. ఆర్సీబీ ఓపెనర్లలో విరాట్ కోహ్లీ (47), డుప్లెసిస్ (54) పరుగులతో శుభారంభాన్ని అందించారు. ఆ తర్వాత.. రజత్ పటిదార్ (41) పరుగులతో చెలరేగాడు. కెమెరాన్ గ్రీన్ (38*) నిలిచాడు. దినేష్…
తమకు పెళ్లి జరిపించాలని వచ్చిన ఓ ప్రేమజంటకు పోలీసులు అనుకోని షాకిచ్చారు. ఉత్తర్ ప్రదేశ్లో గురువారం ప్రేమజంట పోలీసులను ఆశ్రయించింది. తన ప్రేమికుడినే పెళ్లి చేసుకుంటానంటూ దరఖాస్తు ఇచ్చింది. అయితే.. ఇంతలో అమ్మాయి తల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. తమ బిడ్డను కావాలని తీసుకొచ్చాడని పోలీసులకు తెలిపింది. దీంతో.. పోలీసులు అమ్మాయిని తల్లికి అప్పగించారు. కాగా.. ప్రేమికుడిపై శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు చర్యలు తీసుకున్నారు.