ఆదివారం దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే.. అయితే ఈ గెలుపుతో టీమిండియా సెమీస్ బెర్త్ దాదాపు ఖాయం కాగా.. పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి దాదాపు నిష్క్రమించింది. ఈ క్రమంలో.. పాకిస్తాన్ జట్టుపై సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగారు.
ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్, టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. టీడీపీకి, పార్టీ పదవులను కూడా వదులుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్.. మాజీ కెప్టెన్ బాబర్ ఆజంపై విమర్శలు గుప్పించాడు. బాబర్ ఆజంను 'మోసగాడు' అని అభివర్ణించాడు. అతను మోసగాడు ఎందుకో గల కారణాన్ని అక్తర్ వివరించాడు. బాబర్ ఆజంను పాకిస్తాన్ కింగ్ అని పిలుస్తారు.. కానీ ఆజం పెద్ద మ్యాచ్‌లలో జట్టు తరపున సరిగ్గా ఆడలేకపోతున్నాడు. ఈ క్రమంలో అతనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విరాట్ కోహ్లీపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారులు ప్రశంసల జల్లు కురిపించారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. ఈ క్రమంలో మాజీ బీసీసీఐ చైర్మన్, మాజీ క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్, బోర్డు వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమల్ ప్రశంసించారు.
మహీంద్రా స్కార్పియో-ఎన్ కార్బన్ ఎడిషన్ (Mahindra Scorpio-N Carbon Edition)ను ప్రారంభించింది. ఈ ప్రత్యేక ఎడిషన్‌లో మెటాలిక్ బ్లాక్ థీమ్, స్మోక్డ్ క్రోమ్ యాక్సెంట్‌లు, బ్లాక్ అల్లాయ్ వీల్స్, డార్క్ గాల్వనో-ఫినిష్డ్ రూఫ్ రెయిల్‌లు ఉన్నాయి. ఈ ఎడిషన్‌లో మరింత బోల్డ్, ప్రీమియమ్ డిజైన్‌ను అందిస్తుంది. స్కార్పియో-ఎన్ కార్బన్ ఎడిషన్ ఇంటీరియర్స్‌లో ప్రీమియమ్ లెథరెట్ సీట్లు, కాంట్రాస్ట్ డెకో-స్టిచింగ్, స్మోక్డ్ క్రోమ్ ఫినిషింగ్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి.
ప్రసిద్ధ చెక్ ఆటోమేకర్ స్కోడా.. భారత మార్కెట్‌లోకి కొత్త SUVని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. కంపెనీ త్వరలో దాని SUV లైనప్‌లోకి కొత్త చేరిక అయిన స్కోడా కోడియాక్‌ను విడుదల చేయాలని యోచిస్తోంది. ఏడు సీట్ల పూర్తి పరిమాణ SUVని త్వరలో భారతదేశంలో విడుదల చేయనున్నట్లు స్కోడా ఆటో బ్రాండ్ డైరెక్టర్ పీటర్ జనేబా ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు.
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ తన జట్టుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, యాజమాన్యాన్ని కూడా తప్పు పట్టారు. పాకిస్తాన్ జట్టును ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఎంపిక చేసిందని వ్యంగ్యస్త్రాలు సంధించాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా.. దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ప్రదర్శన, వ్యూహం రెండింటిలోనూ విఫలమైంది. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ ఐడియాలు పని చేయలేదు. కాగా.. పాకిస్తాన్ కెప్టెన్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రిజ్వాన్ మ్యాచ్ సమయంలో 'తస్బీహ్' ప్రార్థన పూసలు పట్టుకుని కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
భారత్- పాక్ మధ్య జరిగిన హై ఓల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 242 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి 45 బంతులు ఉండగానే పూర్తి చేసింది. ఈ మ్యాచ్‌లో ఫోర్ కొట్టి టీమిండియాకు మర్చిపోలేని విక్టరీని అందించాడు విరాట్ కోహ్లీ. ఈ లెజెండరీ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ క్రీజులో అడుగు పెట్టిన దగ్గర్నుంచి పాక్ బౌలర్లను చీల్చి చెండాడాడు.
భారత్- పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఎన్ని పనులు ఉన్నా అన్నీ ముగించుకుని వచ్చి టీవీల ముందు, ఫోన్ల ముందు అతుక్కుపోవాల్సిందే.. భారత్, పాకిస్తాన్ మధ్య ఏ మ్యాచ్ జరిగినా అభిమానులకు పండగే.. ఎందుకంటే ఈ జట్ల మధ్య మ్యాచ్‌లు తక్కువగా ఉంటాయి. ఈ రెండు జట్ల మధ్య ఎన్నో మరుపురాని మ్యాచ్‌లు జరిగాయి. అందులోనూ ఈ రెండు టీముల మధ్య పోటీ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.