భారత్- పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఎన్ని పనులు ఉన్నా అన్నీ ముగించుకుని వచ్చి టీవీల ముందు, ఫోన్ల ముందు అతుక్కుపోవాల్సిందే.. భారత్, పాకిస్తాన్ మధ్య ఏ మ్యాచ్ జరిగినా అభిమానులకు పండగే.. ఎందుకంటే ఈ జట్ల మధ్య మ్యాచ్‌లు తక్కువగా ఉంటాయి. ఈ రెండు జట్ల మధ్య ఎన్నో మరుపురాని మ్యాచ్‌లు జరిగాయి. అందులోనూ ఈ రెండు టీముల మధ్య పోటీ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ లాంటి వాళ్లు భారత్ తరఫున.. వసీం అక్రమ్, షోయబ్ అక్తర్, బాబర్ ఆజమ్ పాకిస్తాన్ తరఫున ఎన్నో రికార్డులు సృష్టించారు. అయితే.. ఐసీసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకోవాలన్న ఆశ అన్నీ జట్లకు ఉంటాయి. అందులో భాగంగా.. భారత్, పాకిస్తాన్ మధ్య హైఓల్టేజ్ నడుస్తుంది.
Read Also: Infinix Note 50 series: ఏఐ ఫీచర్లతో ఇన్ఫినిక్స్ నోట్ 50 సిరీస్ వచ్చేస్తోంది..
కాగా.. ఈ మ్యాచ్ ప్రాధాన్యతను గుర్తించిన ఓ వరుడు తన స్నేహితుల కోసం పెళ్లి మండపంలోనే మ్యాచ్ లైవ్ చూసే ఏర్పాట్లు చేశాడు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం నిపాని గ్రామానికి చెందిన మస్కరి మణిశర్మ, సాయిప్రియల వివాహం ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం జరిగింది. అదే మండపంలో పెళ్లి వీడియో వీక్షించాల్సిన తెరపై దాయాదుల పోరును ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే ఏర్పాటు చేశారు. అటు స్నేహితుడి పెళ్లి వేడుకను.. ఇటు ఉత్కంఠ రేపే క్రికెట్ మ్యాచ్‌ను ఒకే ప్రాంగణంలో చూడటం ఆనందంగా ఉందని వరుడి స్నేహితులు పేర్కొన్నారు. ఇది చూసిన జనాలు.. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇంత క్రేజ్ ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు.
Read Also: Mumaith Khan : కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన ముమైత్