ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఆదివారం నిర్వహించిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షల ప్రాథమిక 'కీ' విడుదల చేసింది. రెండు పేపర్ల 'కీ' లు ఏపీపీఎస్సీ వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ప్రకటించింది.
విరాట్ కోహ్లీకి పాకిస్తాన్‌పై ఎన్నో రికార్డులు ఉన్నాయి. తాజాగా మరో రెండు రికార్డులను బద్దలు కొట్టాడు. మొదట ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు మహమ్మద్ అజారుద్దీన్ అత్యధిక క్యాచ్‌ల రికార్డును బద్దలు కొట్టాడు. బ్యాటింగ్‌లో మరో రికార్డు నెలకొల్పాడు. పాకిస్తాన్‌తో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో కోహ్లీ 14,000 పరుగులు పూర్తి చేశాడు.
ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎంగా చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా కరువు కాటకాలు వస్తాయని ఆరోపించారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పూర్తిగా తగ్గిపోతాయి.. ఇప్పుడు మిర్చి ధర పతనం అయ్యిందన్నారు. పెట్టుబడి పెరిగిపోయింది, ఉత్పత్తి తగ్గిపోయింది అని అధికారులు ముందే చెప్పారు.. అయినా సీఎం చంద్రబాబు పట్టించుకోలేదని తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు జగన్.. మిర్చి రైతుల ఆవేదన తెలుసుకోవడానికి వస్తే గానీ ప్రభుత్వం మిర్చి రైతుల సమస్య గుర్తుకు రాలేదని దుయ్యబట్టారు.
రాజమండ్రిలో కేంద్ర బడ్జెట్ 2025-26పై మేధావుల సమావేశం జరిగింది. ఈ సదస్సుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మేధావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ప్రజా బడ్జెట్ అని అన్నారు. వ్యవసాయ రంగానికి కేంద్ర బడ్జెట్లో పెద్దపీట వేశారని తెలిపారు.
స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు 68వ జయంతి సందర్భంగా.. శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యాలయంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, జిల్లా టీడీపీ నేతలు ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఎర్రన్న ఆశయాలు కొనసాగిస్తామని తెలిపారు. ఎర్రన్నాయుడు బడుగు బలహీన వర్గాల నాయకుడు.. దివంగత ఎన్టీఆర్ ఆశయ సాధనకు ఎర్రన్న పనిచేశారని పేర్కొన్నారు.
సెంటర్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో గ్రూప్-2 అంధ విద్యార్థిని సంజనకు అన్యాయం జరిగింది. గుంటూరు నుంచి కడపకు గ్రూప్ 2 పరీక్ష రాసేందుకు వచ్చిన అంధ విద్యార్థిని సంజన.. సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో పరీక్ష రాయలేకపోయింది.
విశాఖలో నిర్వహించిన బడ్జెట్ పై మేధావుల సమావేశంలో కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్‌లో అన్ని వర్గాలకు సమతుల్యం పాటించారు.. రైతులకు పెద్ద పీట వేశారని తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని రూ.5 లక్షలకు పెంచారు.. వ్యవసాయ పెట్టుబడి సమకూర్చే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. కేంద్రం ధన్ వ్యయన్ అనే పథకం తీసుకువచ్చింది.. ఫసల్ బీమా యోజన యధావిధిగా కొనసాగుతోంది.. యూరియా, డీఏపీ ధరల విషయంలో రాయతీలు ఇస్తోందని పేర్కొన్నారు.
కృష్ణా జిల్లా గన్నవరంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు పోలవరం కాలువలో పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన విషాద ఘటన ఆదివారం జరిగింది. బాపులపాడు మండలం వీరవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.