ప్రసిద్ధ చెక్ ఆటోమేకర్ స్కోడా.. భారత మార్కెట్‌లోకి కొత్త SUVని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. కంపెనీ త్వరలో దాని SUV లైనప్‌లోకి కొత్త చేరిక అయిన స్కోడా కోడియాక్‌ను విడుదల చేయాలని యోచిస్తోంది. ఏడు సీట్ల పూర్తి పరిమాణ SUVని త్వరలో భారతదేశంలో విడుదల చేయనున్నట్లు స్కోడా ఆటో బ్రాండ్ డైరెక్టర్ పీటర్ జనేబా ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. స్కోడా కోడియాక్ ఏప్రిల్ 2025లో లాంచ్ అవుతుందని నివేదికలు చెబుతున్నాయి . అయితే, లాంచ్ తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు.
Read Also: RK Roja: వైఎస్ జగన్తో ఆర్కే రోజా భేటీ.. నగరిలో తాజా పరిణామాలపై చర్చ..!
స్కోడా కోడియాక్ SUV ఫీచర్లు:
ఎక్స్‌టీరియర్ డిజైన్: ఈ SUVలో బోల్డ్ బ్లాక్-అవుట్ ఫ్రంట్ గ్రిల్, కొత్తగా రూపొందించిన అల్లాయ్ వీల్స్, సైడ్ క్లాడింగ్, LED డేటైమ్ రన్నింగ్ లైట్లు (DRLలు) ఉంటాయి.
ఇంటీరియర్ ఫీచర్లు : స్కోడా కోడియాక్ SUVలో బ్లాక్ థీమ్‌ను కలిగి ఉంటుంది. 13-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో ఉంటుంది. ప్రీమియం మెటీరియల్స్, డిజైన్ అంశాలు క్యాబిన్ యొక్క లగ్జరీ అనుభూతిని పెంచుతాయి. సేఫ్టీ కోసం కోడియాక్ ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్)తో వస్తుంది.
ఇంజిన్ & పనితీరు:
స్కోడా కోడియాక్ శక్తివంతమైన 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది . ఈ ఇంజిన్ 190 హార్స్‌పవర్, 320 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సిటీ డ్రైవింగ్, ఆఫ్-రోడ్ సామర్థ్యాలకు తగినంత శక్తిని అందిస్తుంది. అలాగే.. 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంది. 4X4 డ్రైవ్‌ట్రెయిన్ ఎంపికతో వస్తుంది.
పోటీ:
స్కోడా కోడియాక్ D-సెగ్మెంట్ SUV విభాగంలో పోటీపడుతుంది. టయోటా ఫార్చ్యూనర్, MG గ్లోస్టర్ వంటి మోడళ్లతో పోటీ పడుతుంది.
ధర అంచనాలు:
స్కోడా కోడియాక్ ఖచ్చితమైన ధరను లాంచ్ సమయంలో వెల్లడించనున్నారు. అయితే దీని ధర సుమారు ₹40 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా. స్కోడా కోడియాక్‌ను మొదటిసారిగా జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2025 లో ప్రదర్శించారు. అక్కడ కస్టమర్‌ల నుండి సానుకూల స్పందన వచ్చింది. ఈ క్రమంలో.. కంపెనీ ఇప్పుడు భారతదేశంలో అధికారికంగా లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.