మహీంద్రా స్కార్పియో-ఎన్ కార్బన్ ఎడిషన్ (Mahindra Scorpio-N Carbon Edition)ను ప్రారంభించింది. ఈ ప్రత్యేక ఎడిషన్‌లో మెటాలిక్ బ్లాక్ థీమ్, స్మోక్డ్ క్రోమ్ యాక్సెంట్‌లు, బ్లాక్ అల్లాయ్ వీల్స్, డార్క్ గాల్వనో-ఫినిష్డ్ రూఫ్ రెయిల్‌లు ఉన్నాయి. ఈ ఎడిషన్‌లో మరింత బోల్డ్, ప్రీమియమ్ డిజైన్‌ను అందిస్తుంది. స్కార్పియో-ఎన్ కార్బన్ ఎడిషన్ ఇంటీరియర్స్‌లో ప్రీమియమ్ లెథరెట్ సీట్లు, కాంట్రాస్ట్ డెకో-స్టిచింగ్, స్మోక్డ్ క్రోమ్ ఫినిషింగ్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. ఈ ఎడిషన్ Z8, Z8L సెవెన్-సీటర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.
Read Also: Medigadda Barrage : హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావు పిటిషన్‌పై విచారణ.. తీర్పు రిజర్వ్
వేరియంట్ వారీగా ధరలు (ఎక్స్-షోరూమ్):
Z8L AT 4WD Black Edition ధర రూ.24.89 లక్షలు (ఎక్స్-షోరూమ్).
Z8 MT పెట్రోల్ మోడల్ ధర సుమారు రూ.19.19 లక్షలు.
మహీంద్రా స్కార్పియో-ఎన్ కార్బన్ ఎడిషన్ మూడు పవర్‌ట్రెయిన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. 2.0-లీటర్ mStallion TGDi Petrol Engine: ఈ ఇంజిన్ 203PS పవర్, 370Nm టార్క్ (మాన్యువల్) లేదా 380Nm టార్క్ (ఆటోమేటిక్) అందిస్తుంది. 2.2-లీటర్ mHawk CRDi Diesel Engine: ఈ ఇంజిన్ 175PS పవర్, 400Nm టార్క్ అందిస్తుంది. అదనంగా 132PS పవర్, 300Nm టార్క్ ఉత్పత్తి చేసే తక్కువ పవర్ తో కూడిన డీజిల్ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. పెట్రోల్, డీజిల్ వేరియంట్‌లు 6-స్పీడ్ మాన్యువల్.. 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో వస్తాయి. 4WD ఎంపిక కూడా అందుబాటులో ఉంటుంది. ఇది ఆఫ్-రోడ్ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.
ముఖ్యమైన ఫీచర్లు:
స్కార్పియో-ఎన్ ముఖ్యమైన ఫీచర్లలో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 7-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటో-డిమ్మింగ్ IRVM, వైర్‌లెస్ ఛార్జింగ్, 12-స్పీకర్ సోనీ ఆడియో సిస్టమ్ మరియు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఉన్నాయి.