గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కస్టడీ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వంశీ సహా మరో ఇద్దరు నిందితుల పోలీస్ కస్టడీ ఆదేశాలు రద్దు చేయాలని ఏ7, ఏ8 తరఫు న్యాయవాది చిరంజీవి మెమో దాఖలు చేశారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానంపై చర్చలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. టీడీపీ జనసేన బీజేపీ కలవడం దగా పడ్డ రాష్ట్రం పునర్నిర్మాణం లక్ష్యంగా ఏర్పాటు జరిగిందని తెలిపారు. అసెంబ్లీలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు, ప్రస్తుతం గత ప్రభుత్వానికి సంబంధించి సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఏపీ ఫైబర్ నెట్ నూతన ఎండీగా ప్రవీణ్ ఆదిత్యను నియమించారు. అందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రవీణ్ ఆదిత్య ఏపీ మారిటైం బోర్డ్ సీఈఓగా ఉన్నారు. కాగా.. ఫైబర్ నెట్ ఎండీగా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.
శాసన మండలిలో వైసీపీ ప్రతిపక్ష హోదాపై మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. వైసీపీ ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతుందని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదాపై పార్లమెంట్, అసెంబ్లీ నియమ నిబంధనలను లోకేష్ చదివి వినిపించారు.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. పవన్ నోట మళ్ళీ క్షమాపణలు అనే పదం వచ్చింది. వైసీపీ నేతలు ఇబ్బంది పెడుతున్నా గవర్నర్ నిన్న విజయవంతంగా ప్రసంగం పూర్తి చేశారని తెలిపారు. ఎన్డీఏ సభ్యులు 164 మంది చాలా బాధ్యతతో ఉన్నారు.. వైసీపీ నేతల తీరుపట్ల తమ తప్పు లేకున్నా గవర్నర్ కు తామంతా క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు.
తెలంగాణ భవన్‌లో స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన మాజీ జడ్పిటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ సీనియర్ నేత మల్కిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికార కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి.. 15 నెలల కాలంలోనే అధికార పార్టీని వదిలిపెట్టి బీఆర్ఎస్‌లో చేరుతున్నారంటే.. కాంగ్రెస్ పాలన ఏ రకంగా ఉందో చెప్పొచ్చని అన్నారు.
ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా సాగుతుంది. 35 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా ముగ్గురు ప్రధాన అభ్యర్థులు మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఎన్నికల ప్రచారాలకు ఈరోజు సాయంత్రంతో తెరపడడంతో ఓటర్లను ఆకట్టుకోవడానికి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా.. ఈనెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం చోటు చేసుకుని మూడు రోజులు గడుస్తుంది. టన్నెల్‌లో గల్లంతైన ఎనిమిది మంది ఆచూకీపై ఇంకా క్లారిటీ లేదు. రెస్క్యూ టీమ్స్ పలుమార్లు టన్నెల్‌లోకి వెళ్లి ముందుకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో తిరిగి వచ్చాయి. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రెస్క్యూ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. టన్నెల్లో చిక్కుకున్న వారిని క్షేమంగా తిరిగి తీసుకురావడానికి సర్వ శక్తులా ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.
ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22 నుండి ప్రారంభం కానుంది. కాగా.. ఐపీఎల్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తమ అసిస్టెంట్ బౌలింగ్ కోచ్‌గా నియమించింది. డ్వేన్ బ్రావో స్థానంలో 49 ఏళ్ల భారత మాజీ ఆల్ రౌండర్ శ్రీధరన్ శ్రీరామ్‌కు బాధ్యతలు అప్పగించారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. 6వ మ్యాచ్ బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్ మధ్య జరిగింది. రావల్పిండి క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధించింది. 237 పరుగుల లక్ష్యాన్ని 23 బంతులు ఉండగానే గెలిచింది. 46.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది.