ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈ రెండు జట్లు తలపడినప్పుడు ఎక్కడున్నా సరే అన్నీ పనులు ముగించుకుని వచ్చి టీవీల ముందు వాలిపోవాల్సిందే.. అందుకే ఇది క్రికెట్లోనే బిగ్ ఫైట్. అయితే.. మైదానంలో ఆటగాళ్ల మధ్యనే కాదు, ఇరు జట్ల అభిమానుల మధ్య కూడా కవ్వింపు చర్యలు సర్వ సాధారణం. నా దేశం ఆటగాళ్లు గొప్ప అంటే.. నా దేశం ఆటగాళ్లు గొప్ప అని ఒకరికొకరు కామెంట్స్ చేస్తూనే ఉంటారు. కాగా.. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే.. అయితే ఈ గెలుపుతో టీమిండియా సెమీస్ బెర్త్ దాదాపు ఖాయం కాగా.. పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి దాదాపు నిష్క్రమించింది. ఈ క్రమంలో.. పాకిస్తాన్ జట్టుపై సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగారు.
Read Also: SLBC: టన్నెల్‌లో నిలిచిపోయిన రెస్క్యూ ఆపరేషన్..
కాగా.. భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అవుట్ కాగానే పాక్ స్పిన్నర్ అబ్రార్ పెవిలియన్ వైపు చూపిస్తూ “వెళ్లు.. వెళ్లు“ అంటూ సైగ చేశాడు. ఈ క్రమంలో.. అతనిపై నెటిజన్లు సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇంత కష్టపడి ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించిన పాకిస్తాన్ జట్టు.. కేవలం ఈ టోర్నీలో ఉన్నది 5 రోజులు మాత్రమే. తొలి మ్యాచ్ న్యూజిలాండ్‌తో ఆడి ఓడిపోగా.. కీలకమైన మ్యాచ్‌లో టీమిండియాపై ఓటమిని చవి చూసింది. దీంతో.. ఆతిధ్య జట్టుకు ఇంటి దారి పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో పాకిస్తాన్ పై నెటిజన్లు విపరీతమైన మీమ్స్‌తో రెచ్చిపోతున్నారు.
Virat Kohli to Haris Rauf everytime they meet.#INDvsPAK #ViratKohli𓃵 pic.twitter.com/JcmNoVbMxq
— Jai Updhyay (@jay_upadhyay14) February 23, 2025
Match Summary #INDvsPAK #ViratKohli𓃵 @YaariSports pic.twitter.com/14ceMAUmAu
— Sushant Mehta (@SushantNMehta) February 23, 2025
Absolute Cinema 💯 #ViratKohli #INDvsPAK #IndiavsPakistan pic.twitter.com/yibKy8O1Kr
— Fukkard (@Fukkard) February 23, 2025
మరోవైపు.. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ ఓడిపోతుందని ఆదివారం అభయ్ సింగ్ (ఐఐటీ బాబా) ఒక ‘బోల్డ్’ జోస్యం చెప్పాడు. అయితే, భారత్ పాకిస్థాన్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించడంతో అతని జోస్యం తిప్పికొట్టింది. దీంతో.. అభిమానులు సోషల్ మీడియాలో ఐఐటీ బాబాపై విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకు సంబంధించిన మీమ్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Pakistanis waiting for IIT Baba.. pic.twitter.com/sdZWZgris8
— BHK🇮🇳 (@BHKslams) February 23, 2025
IIT baba now pic.twitter.com/cbMvTR98ps
— Alice In Chaos (@Delhiwalididi) February 23, 2025
Read Also: GV Reddy: ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా..