భారతదేశంలో ఎండలు దడపుట్టిస్తున్నాయి. 45 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో.. ఢిల్లీతో సహా పలు చోట్ల మధ్య, తూర్పు మరియు ఉత్తర భారతదేశంలో తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయి. దీంతో.. 54 మంది మృతి చెందారు. మే 31 నుంచి జూన్ 1 వరకు ఉత్తరప్రదేశ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో తీవ్ర వడగాల్పులు వీస్తాయని అంచనా వేశారు. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. మే 31 నుంచి జూన్ 2 మధ్య వాయువ్య భారతదేశంలోని మైదానాలలో ఉరుములు…
తూర్పు ఢిల్లీలోని మధు విహార్ ప్రాంతంలోని పార్కింగ్ స్థలంలో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 16 కార్లు దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు. తెల్లవారుజామున 1.17 గంటలకు జరిగిన ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. తొమ్మిది అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపు చేశాయి. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు. వివరాల ప్రకారం.. పార్కింగ్ స్థలంలో అద్దె ప్రాతిపదికన తమ వాహనాలను పార్క్ చేసే స్థానికులకు చెందిన కార్లు అని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల…
జీడిమెట్ల పియస్ పరిధిలోని న్యూ ఎల్బీనగర్ లో దారుణం జరిగింది. షాపూర్ నగర్, ఎన్ ఎల్బీనగర్ లో నివాసం ఉండే అఖిల (22) అనే అమ్మాయిని అదే ప్రాంతంలో నివాసం ఉండే అఖిల్ సాయిగౌడ్ 8 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడు. తొలుత అఖిల ప్రేమను తిరస్కరించడంతో.. చనిపోతానని అఖిల్ గౌడ్ బెదిరించడంతో తప్పని పరిస్దితిలో అఖిల ప్రేమించింది. ఈ మధ్య అఖిల్ గౌడ్ అఖిలతో చిన్నచిన్న విషయాలపై గొడవపడి రోడ్డుపై వేధించడం ప్రారంభించాడు. పెళ్ళి చేసుకోనని తేల్చిచెపడంతో అఖిల తీవ్ర మనస్దాపానికి గురై ఇంట్లో ఉరేసుకుని…
నల్గొండ రూపురేఖలను మార్చేసే నల్గొండ బైపాస్ రోడ్డు నిర్మాణంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బుధవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈపీసీ పద్ధతిలో రూ.524.85 కోట్లతో నిర్మించ తలపెట్టిన ప్రతిష్టాత్మకమైన ఈ బైపాస్ రోడ్డుకు సంబంధించిన ప్రస్తుత స్థితిగతులపై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాలుగు లేన్లుగా 14 కి.మీ నిర్మిస్తున్న ఈ రోడ్డును ఎలక్షన్ కోడ్ ముగియగానే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేలా పూర్వపనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో అవసరమైన విత్తనాల సరఫరా తగినంతగా ఉండేలా విత్తన కంపెనీలతో ఫిబ్రవరి, మార్చి మాసంలో వరుస సమావేశాలు నిర్వహించామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 2023-24 సంవత్సరంలో 44.92 లక్షల ఎకరాల పత్తి పంట సాగు కాగా.. ఈ వానా కాలానికి 55 లక్షల ఎకరాలలో పత్తి పంట సాగు కాగలదని అంచనా వేసి 1.24 కోట్ల పత్తివిత్తన ప్యాకేట్లను రైతులకు అందుబాటులో ఉంచడానికి మార్చి మాసంలోనే ప్రణాళిక చేయడం జరిగిందని.. దానికనుగుణంగా ఈరోజు వరకు 51,40,405 పత్తి ప్యాకేట్లు వివిధ జిల్లాలలో…
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఒరిస్సాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి భువనేశ్వర్కి చేరుకుంటారు. గురువారం ఉదయం భువనేశ్వర్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి భద్రలోక్ పార్లమెంట్ నియోజకవర్గంలో యువ నేత రాహుల్ గాంధీతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. గత వారం రోజులపాటు పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్ కోట్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ప్రచారం నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్కు చేరుకున్న డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు.
తెలంగాణ రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణాలు తీసివేయడానికి నిరసిస్తూ ఖిలా వరంగల్లోని కాకతీయ కళాతోరణం ఎదుట బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు. కాకతీయ రాజుల పాలన దీక్షకు ప్రతీక అయిన కాకతీయ కళా తోరణాన్ని దురుద్దేశంతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలగిస్తన్నట్టు నిరసన వ్యక్తం చేశారు. వరంగల్ ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, బీఆర్ఎస్ నేతలు…
నల్గొండ, సూర్యాపేట జిల్లాలో తెలంగాణ వైద్య మండలి సభ్యులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం, నకిలీ వైద్య వ్యవస్థ ద్వారా వైద్య పరంగా.. ఎటువంటి విద్యార్హత లేకుండా పేద ప్రజల అవసరాలను అవకాశంగా తీసుకొని నిలువు దోపిడీ చేస్తున్న వచ్చి రాని వైద్యం చేస్తున్న నకిలీ వైద్యులను గుర్తించి NMC చట్టం ప్రకారం తెలంగాణ వైద్య మండలి అధికారులు కేసులు నమోదు చేశారు.
ఢిల్లీ అగ్నిగుండంగా మారింది. ఎన్నడూ లేనంత రికార్డ్ ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీలో ఈరోజు 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీలోని ముంగేష్‌పూర్‌లోని వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం 2.30 గంటలకు 52.3 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే.. రికార్డ్ ఉష్ణోగ్రత నమోదైన అనంతరం తాజాగా ఢిల్లీలో పలు చోట్ల వర్షం కురుస్తుంది.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. పలు నంబర్ల నుండి ఫోన్ వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అంతేకాకుండా.. తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ నెంబర్లను కాల్ లిస్ట్ స్క్రీన్ షాట్ ను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కాగా.. బెదిరింపు కాల్స్ పై ఆయన స్పందించారు. ఈ కాల్స్ తనకు కొత్తేమీ కాదని.. వీటిపై గతంలో ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. అయినా ఒక బాధ్యత గల పౌరుడుగా పోలీసుల…