Jupalli Krishna Rao: నిబంధలన మేరకే సోమ్ డిస్టిలరీస్ బ్రాండ్ మద్యం సరఫరాకు అనుమతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నియమ నిబంధనల మేరకే సోమ్ డిస్టిలరీస్ కంపనీ తమ ఉత్పత్తులను తెలంగాణ బేవరేజ్ కార్పోరేషన్ కు సరఫరా చేసేందుకు అనుమతినిచ్చిందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. కొత్త మద్యం బ్రాండ్లకు సంబంధించి తమ వద్దకు ఎటువంటి దరఖాస్తులు రాలేవని గతంలో ఓ ప్రెస్ మీట్ సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు మంత్రి చెప్పారు. ఆ ఫైల్ తన వద్దకు రాలేదని, ఇప్పుడు ఉన్న ప్రోసీజర్ ప్రకారమే నిర్ణయాలు తీసుకునే అధికారం బెవరేజ్ కార్పోరేషన్ కు ఉందని.. ఈ నేపథ్యంలోనే సోమ్ డిస్టిలరీస్ కు తమ ఉత్పత్తుల సరఫరాకు అమమతినిచ్చారని మంత్రి వెల్లడించారు.
Rajkot game zone: డీఎన్‌ఏ టెస్ట్ రిపోర్టు.. గేమ్ జోన్ యజమాని ఏమయ్యాడంటే..!
Also Read
బేవరేజ్ కార్పోరేషన్ రోజువారీ కార్యకలాపాలు తమ దృష్టికి రావని వాస్తవవాలను తెలుసుకోకుండానే కొన్ని పత్రికలు అసత్య వార్తలను ప్రచురించాయని మంత్రి అన్నారు. రాష్ట్రంలో హోల్‌సేల్ మద్యం సరఫరాకు కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇచ్చే ప్రక్రియ తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ పరిధిలో ఉంటుందని.. డిమాండ్- సప్లయ్ ను బట్టి కొత్త కంపెనీలకు అనుమతులు మంజూరు చేస్తుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రెండు దశాబ్దాలుగా సోమ్ డిస్టిలరీస్ తమ ఉత్పత్తులను విక్రయిస్తుందని.. దేశ వ్యాప్తంగా 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని IMFL సరఫరాదారుగా ఉందని చెప్పారు. ఇప్పటికే ఉన్న ఎక్సైజ్ పాలసీ ప్రకారమే బెవరేజ్ కార్పోరేషన్ లిమిటెడ్ ఎండీ.. సామ్ డిస్టిలరీస్ తో పాటు ఇతర కంపెనీలకు మద్యం సరఫరాకు అనుమతులిచ్చారని తెలిపారు. ఎక్కడా కూడా నిబంధనల ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేశారు.
Krishna Chaitanya: ఆ స్థాయి నాకు లేదు.. కానీ ఎన్టీఆరే వెనక ఉండి నడిపిస్తున్నారనిపిస్తుంది
బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో నాలుగు సంవత్సరాల క్రితం కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇచ్చిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2020-2021 సంవత్సరంలో 50 లిక్కర్ బ్రాండ్లు, 5 బీర్ బ్రాండ్ల కంపెనీలకు, 2021-2022లో 75 లిక్కర్ బ్రాండ్లు, 8 బీర్ బ్రాండ్ల కంపెనీలకు, 2022-2023లో 122 లిక్కర్ బ్రాండ్లు, 11 బీర్ బ్రాండ్ల కంపెనీలకు, 2023-2024లో 41 లిక్కర్ బ్రాండ్లు, 9 బీర్ బ్రాండ్ల కంపెనీలకు అనుమతులు ఇచ్చిందని అన్నారు. గతంలో కూడా బెవరేజ్ కార్పోరేషన్ లిమిటెడ్ కొత్తగా మద్యం కంపెనీలకు ఇలానే అనుమతులు ఇచ్చిందని, ఆ ప్రోసీజర్ ప్రకారమే తాము అప్రూవల్ ఇచ్చామని… దురుద్దేశపూర్వకంగా కొన్ని వార్త పత్రికలు తప్పుడు వార్తలను ప్రచురించాయని వెల్లడించారు. మొత్తం IMFL/బీర్ల తయారీ, సప్లయ్ చైన్ 97.44% విదేశీ కంపెనీలే ఆక్రమించాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మన దేశానికి చెందిన సోమ్ డిస్టిలరీకి మద్యం సరఫరాకు అనుమతులు ఇవ్వడాన్ని రాజకీయం చేస్తున్నారని మంత్రి తెలిపారు. దీన్ని కూడా బీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేయడం విడ్డూరంగా ఉందని, ఇలాంటి అసంబద్దమైన దుష్ప్రచారాలను ప్రచారం చేయడం మానుకోవాలని కోరారు. ఇలాంటి నిరాధార ఆరోపణలు ప్రచారం చేస్తూ.. ప్రజల విలువైన సమయాన్ని వృధా చేయవద్దని సూచించారు.
తాజావార్తలు
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!