అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తుర్కపల్లి జినోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం శామీర్ పేట్ మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన రుద్రబోయిన మహేందర్ (35) అదే గ్రామంలో స్క్రాప్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత సంవత్సరం 2023లో శామీర్ పేట్ గ్రామానికి చెందిన దూడల నాగేష్ గౌడ్ అనే వ్యక్తి దగ్గర రూ.6 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అందులో నుంచి రూ.4 లక్షల 70 వేల రూపాయలను చెల్లించాడు. కానీ నాగేష్ గౌడ్ మహేందర్ను నువ్వు కట్టిన డబ్బులు కేవలం మిత్తి మాత్రమే అని.. అసలు రూ.6 లక్షల రూపాయలు అలాగే ఉన్నాయని తనకు మొత్తం రూ.6 లక్షలు చెల్లించాలని మహేందర్ను వేధింపులకు గురి చేసాడు.
Read Also: Viral Video: గంగానది నుంచి బయటకు వచ్చిన పది అడుగుల మొసలి.. వీడియో వైరల్..
దీంతో మనస్తాపం చెందిన మహేందర్ సూసైడ్ నోట్ రాసి బాధతో సెల్ఫీ వీడియో తీసుకొని తుర్కపల్లిలోని తన స్క్రాప్ దుకాణంలో దూలానికి నైలాన్ తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుడి కుటుంబీకులు నాగేష్ వేధింపుల వల్లనే మహేందర్ ఆత్మహత్య చేసుకున్నాడని.. నాగేష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తమకి న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు.
Read Also: Pushpa 2 : షూటింగ్ కు అవి తీసుకురావద్దంటూ పుష్ప టీం కు స్ట్రిక్ట్ కండిషన్..