CM Revath Reddy: తెలంగాణ గీతం, రాజముద్ర ఎంపికపై సీఎం కసరత్తు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ గీతం, రాజముద్ర ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో.. ముఖ్యమంత్రి నివాసానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వచ్చారు. తెలంగాణా గీతం, తెలంగాణ లోగో ఎంపిక పై వారిద్దరూ చర్చిస్తున్నారు. మరోవైపు.. తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన తుది దశకు చేరుకుంది. ఈ క్రమంలో.. గీతం రూపకల్పనపై కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణితో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష చేపట్టారు. సాయంత్రం వరకు పాటకు సంబంధించి పూర్తిస్థాయిలో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు.. తెలంగాణ రాజముద్రకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లోగో, గీతాన్ని ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయనుంది.
US: వామ్మో ఏం గాలి.. ఓ విమానం ఏమైందంటే..!
Also Read
- ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
- Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
రాజముద్రకు సంబంధించి గతంలో ఉన్న రంగులే ఉండనున్నాయి. కాకపోతే.. గతంలో ఉన్న రాజముద్రకు సంబంధించి అందులో రాచరిక పోకడలు ఉన్నాయని.. తెలంగాణ అనేది ఉద్యమం, సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక అంశాలను పొందుపరిచేలా రాజముద్ర ఉంటే బాగుటుందనే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. అందుకు అనుగుణంగా చిహ్నాలను పొందుపరిచే అవకాశం ఉంది. కాగా.. రాష్ట్ర గీతాన్ని రూపొందించేందుకు అందెశ్రీకి బాధ్యతలు అప్పగించగా.. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణితో కలిసి జయ జయహే తెలంగాణ పాటను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రాంచంద్రు నాయక్, గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే సంపత్, ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్, తదితరులు హాజరయ్యారు.
RudraM-2 Missile: రుద్రఎమ్-2 క్షిపణి పరీక్ష విజయవంతం.. దాని విశేషాలేంటో తెలుసుకుందామా?
తాజావార్తలు
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
-
Mythri Ravi: “రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు”
-
Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
-
Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!