MLA Kavvampally: ఫోన్ ట్యాపింగ్ నీచాతి నీచమైన చర్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డీసీపీ రాధాకిషన్ ఫోన్ ట్యాపింగ్లో తన పేరు ఉందని చెప్పాడన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని నిన్నటి నుండి చాల బాధపడ్డానని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్తో మాజీ ముఖ్యమంత్రి, కేటీఆర్, హారీష్ రావు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసారని దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్ నీచాతి నీచమైన చర్య అని మండిపడ్డారు. నా ఫోన్ ట్యాపింగ్ చేయడానికి నేనేమైనా తీవ్రవాదినా? అని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వలన తనకు అత్యంత దగ్గరి వ్యక్తి, తన పర్సనల్ అసిస్టెంట్ ని దూరం చేసుకున్నట్లు చెప్పారు.
Telangana Formation Celebrations: ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లు- సీఎస్
Also Read
- Karimnagar : కరీంనగర్లో పొలిటికల్ హీట్.. నేతల అరెస్టులు, వరుస ఘటనలతో టెన్షన్.!
- Karimnagar: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో అక్రమాలు.. ఇద్దరు కానిస్టేబుళ్లు, ఆర్ఎస్ఐ సస్పెన్షన్.!
- Karimnagar: అర్ధరాత్రి దొంగల బీభత్సం.. కత్తులు, తుపాకులతో బెదిరించి.. రూ. 50 లక్షలు అపహరణ.!
- Bus Fire Accident: ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. పూర్తిగా దగ్ధమైన ఆర్టీసీ బస్సు.!
పదేండ్లు పాలించిన ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ వలన తెలంగాణ రాష్ర్ట్రానికి అపవాదు తీసుకువచ్చాడని ఎమ్మెల్యే మండిపడ్డారు. బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తెలిసినా.. ఇప్పటి వరకి స్పందించలేదని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై హైకోర్టుని ఆశ్రహిస్తానని చెప్పారు. సి విజిల్ యాప్లో ఇండ్లలో డబ్బులు ఉన్నాయని ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదన్నారు. తన భార్యతో మాట్లాడిన మాటలు కూడా ఫోన్ ట్యాపింగ్ వలన బహిర్గతం అయ్యాయని వాపోయారు. బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా చీత్కరించారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై కేటీఆర్, హరీష్ రావులు ఎందుకు స్పందించడం లేదని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రశ్నించారు.
Rajkot game zone: డీఎన్‌ఏ టెస్ట్ రిపోర్టు.. గేమ్ జోన్ యజమాని ఏమయ్యాడంటే..!
మరోవైపు.. కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు మాట్లాడుతూ, స్వచ్ఛతకు మారుపేరు కవ్వంపల్లి సత్యనారాయణ అని అన్నారు. నీచ రాజకీయాలు చేసి మరోసారి గద్దెనెక్కాలని కేసీఆర్ చూశారని.. కేసీఆర్ వచ్చాకనే వాట్సప్, ఫేస్ ఆప్ ద కాల్ ఎక్కువగా వాడారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలని కోరారు.
తాజావార్తలు
-
Air India Offer: ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్.. విమాన ఛార్జీలపై 10 శాతం డిస్కౌంట్..
-
TRAI New Rules: జియో, ఎయిర్‌టెల్, వీఐలకు ట్రాయ్ షాక్! అక్టోబర్ 21 నుంచి చౌకైన రీఛార్జ్ ప్లాన్‌లు..
-
SS Karthikeya : “వారణాసి ఒక అగ్నిపర్వతం”
-
Rahul Gandhi: సీఈసీ కారణంగా ఆ 3 రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపించింది
-
SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!