PAK vs IRE: పాకిస్తాన్-ఐర్లాండ్ మ్యాచ్కు పొంచి ఉన్న వర్షం ముప్పు.. పాక్ పరిస్థితేంటి..?
- పాకిస్తాన్-ఐర్లాండ్ మ్యాచ్కు పొంచి ఉన్న వర్షం ముప్పు
- జూన్ 16న ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌లో మ్యాచ్
- శ్రీలంక.. నేపాల్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు
- పాకిస్తాన్-ఐర్లాండ్ మ్యాచ్‌లో వర్షం పడే అవకాశం 91 శాతం ఉంది- వాతావరణ శాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా.. మంగళవారం కెనడాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు విజయం సాధించింది. ఈ టోర్నీలో కెనడాను ఓడించి పాకిస్తాన్ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. కెనడాపై పాకిస్తాన్ గెలిచినప్పటికీ.. ఆ జట్టుకు సమస్యలు తీరలేదు. కాగా.. పాకిస్తాన్ జట్టు తదుపరి మ్యాచ్ జూన్ 16న ఐర్లాండ్‌తో జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఫ్లోరిడాలో వాతావరణం పాక్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది. ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ జట్టు ఆడిన 3 మ్యాచ్ల్లో రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది. కెనడాతో జరిగిన మ్యాచ్‌లో గెలవడం ద్వారా, పాకిస్తాన్ జట్టు టోర్నమెంట్‌లో ఒక అడుగు ముందుకు వేసింది. పాక్.. తర్వాతి మ్యాచ్ ఐర్లాండ్‌తో ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌లో ఆడనుంది.
Heart Pain-Acidity: గుండెనొప్పి, ఎసిడిటీ వల్ల ఛాతిలో కలిగే బాధ మధ్య తేడా ఇదే..
Also Read
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
- Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్‌పింగ్‌ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ జట్టుకు సమస్యలు ఎక్కువయ్యాయి. నివేదికల ప్రకారం.. ఫ్లోరిడాలో వచ్చే వారం రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో.. పాకిస్తాన్-ఐర్లాండ్ మ్యాచ్‌ను వర్షం ప్రభావితం చేసే అవకాశం ఉంది. మరోవైపు.. జూన్ 12న శ్రీలంక, నేపాల్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో శ్రీలంక జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించడం దాదాపు ఖాయమైపోయింది.
Music Shop Murthy: పుష్ప కంటే ముందే మ్యూజిక్ షాప్ మూర్తి.. అదే అసలు పాయింట్: దర్శకుడు ఇంటర్వ్యూ
వాతావరణ నివేదిక ప్రకారం.. పాకిస్తాన్-ఐర్లాండ్ మ్యాచ్‌లో వర్షం పడే అవకాశం 91 శాతం ఉందని అధికారులు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు ఒక్కో పాయింట్ ఇవ్వనున్నారు. ఈ విధంగా.. పాకిస్తాన్ జట్టుకు మొత్తం 3 పాయింట్లు ఉంటాయి. అయితే అమెరికా, ఇండియా ఇప్పటికే గ్రూప్ ‘A’ పాయింట్ల పట్టికలో మొదటి, రెండవ స్థానాల్లో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్ వర్షంతో రద్దయితే.. సూపర్-8 చేరుకోవాలన్న పాకిస్థాన్ జట్టు కల చెదిరిపోనుంది.
తాజావార్తలు
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!