క్యాన్సర్ అనేది చాలా ప్రాణాంతక వ్యాధి. ఈ వ్యాధి పేరు వినగానే ప్రజలు భయపడిపోతారు. క్యాన్సర్ ఒక అవయవం నుండి మొదలై క్రమంగా మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధితో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మరణించారు. లివర్ క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్, లంగ్స్ కేన్సర్, బ్లడ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
వేసవి సెలవులు అనంతరం స్కూళ్లు పున:ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో రేపటి (జూన్ 12) బుధవారం నుంచి బడులు తెరుచుకోనున్నాయి. నేటితో వేసవి సెలవులు ముగియడంతో జూన్ 12 నుంచి తరగతుల్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చేరికల్ని ప్రోత్సహించేందుకు ఇప్పటికే బడిబాట కార్యక్రమాన్ని ప్రారంబించారు. గతవారం నుంచి.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బడిబాట ప్రారంభమైంది. అందులో భాగంగానే జూన్ 12వ తేదీన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్కూళ్లను పున:ప్రారంభించనున్నారు.
బీఆర్ఎస్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాడి కౌశిక్ రెడ్డి బూడిద రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇసుక, ఎర్రమట్టి దందా యథేచ్ఛగా నడిపారని పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పని బూడిదలాగ అయినాక బూడిద రాజకీయం చేస్తుందని విమర్శించారు. రోజుకు 50 లక్షలు సంపాదిస్తున్నారని ఆరోపణలు చేస్తున్న మీరు.. 10 ఏళ్లలో ఎంత సంపాదించారు? అని ఆయన ప్రశ్నించారు. ఎన్టీపీసీ పనులు ప్రారంభించిన నాటి నుండి బూడిదను రైతులకు ఉచితంగా ఇచ్చామని తెలిపారు. మంత్రి…
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి ఆరు మాసాలు గడిచిన ఏ ఒక్క ప్రధాన హామీ నెరవేర్చలేదని ఆరోపించారు. ఎన్నికల కోడ్ పేరుతో ముఖ్యమంత్రి హామీలు అమలు చేయకుండా తప్పించుకుని తిరిగారని పేర్కొన్నారు. రెండు లక్షల రుణమాఫీ చేయకుండా.. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన రవాణా శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా రవాణా శాఖ అధికారులు, డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్లు, ఆర్టీవోలు తదితర అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో ప్రధానంగా చట్టానికి లోబడి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రెవెన్యూ పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యల పై అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశా నిర్దేశం చేశారు. త్రైమాసిక టాక్స్ వసూలుకు సంబంధించి తక్కువగా నమోదు చేసిన వివిధ జిల్లాల అధికారులకు తమ పనితీరు మెరుగుపర్చుకోవాలని సూచించారు.
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్ను పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఈ రోజు ఆకస్మికంగా సందర్శించారు. మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్ లో ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. చిన్నారెడ్డితో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈరోజు సాయంత్రం 4 గంటలకు హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ జె.శ్యామలరావు ఫలితాలు రిలీజ్ చేశారు.
తెలంగాణ ఎడ్సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈరోజు (మంగళవారం) మధ్యాహ్నం 3:30 గంటలకు రిజల్ట్స్ను ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఎంజీ వర్సిటీ ఇంఛార్జి విసి నవీన్ మిట్టల్ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 96.90 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు.