వర్షా కాలం వస్తుందంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. చల్లదనానికి క్రిమి కీటకాలు బయటకు వస్తుంటాయి. అలాంటి సమయంలో మనం చూసి చూడకుండా వాటిపై కాలువేసినా, తగిలినట్లైతే అవి కాటుతో కాటికి చేరుస్తాయి. ముఖ్యంగా వానాకాలంలో పాములతో జాగ్రత్త పడటం చాలా ముఖ్యం. చెత్త చెదారం, చెట్లు ఉన్న దగ్గర చూస్తూ ముందుకు వెళ్లాలి. పొలాల దగ్గరికి వెళ్లిన వారు పాములతో జాగ్రత్త ఉండాలి. అసలు విషయానికొస్తే.. పాముకాటుకు ఓ బాలిక బలైంది. ఈ ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది.
Read Also: World Bank: భారత్ ఆర్థిక వ్యవస్థ బుల్లెట్ వేగంతో వృద్ధి చెందుతుంది.. ప్రపంచ బ్యాంకు వెల్లడి
ములుగు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పాము కాటేయడంతో రాణి (16)అనే బాలిక మృతి చెందింది. వేసవి కాలం సెలవుల కోసమని తన బంధువులైనా పెద్దమ్మ ఇంటికి కత్తిగూడెం వెళ్లింది. అయితే సరదాగా గడుపుదామనుకున్న బాలిక శవమై వచ్చింది. పెద్దమ్మ ఇంటి వద్ద గడ్డివాము దగ్గర ఆరుబయట మంచం మీద కూర్చుంది. తనకు తెలియకుండానే విష పురుగు రాణిని కాటేసింది. మొదట ఎలుకగా భావించిన కుటుంబ సభ్యులు.. బాలిక పరిస్థితి విషమించింది. దీంతో.. బాలికను వెంటనే ఏటూరునాగారం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాణి మృతి చెందింది. మృతురాలు రాణి స్వగ్రామం మంగపేట (మం) కమలాపురం. అయితే.. రాణి మరణంతో కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
Read Also: Delhi: విద్యుత్ సంక్షోభంపై కేంద్రానికి మంత్రి అతిషి లేఖ