Metro Corridor: రిథాలా-నరేలా-కుండ్లీ మెట్రో కారిడార్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం..
- రిథాలా-నరేలా-కుండ్లీ మెట్రో కారిడార్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం
- మెట్రో రెడ్ లైన్ విస్తరణకు మార్గం సుగమం
- రూ.6231 కోట్లతో రిథాలా-నరేలా-కుండ్లి మెట్రో కారిడార్ నిర్మాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెట్రో రెడ్ లైన్ విస్తరణకు మార్గం సుగమమైంది. రిథాలా-నరేలా-కుండ్లీ మెట్రో కారిడార్ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనను గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డీడీఏ (DDA) పంపింది. ఈ మేరకు శనివారం రాజ్‌నివాస్ వెల్లడించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఈ మెట్రో కారిడార్ నిర్మాణ అంశాన్ని కేంద్రంతో వివిధ సందర్భాల్లో ప్రస్తావించినట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Read Also: Auto Accident: ఆటోలో నుంచి ఎగిరిపడ్డ డ్రైవర్.. ఆపై రోడ్డుపై ఉన్న మనుషులపైకి..
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
రూ.6,231 కోట్లతో రిథాలా-నరేలా-కుండ్లి మెట్రో కారిడార్‌ను నిర్మించనున్నారు.ఇందులో ఢిల్లీలో పడే భాగానికి రూ.5,685.22 కోట్లు, హర్యానాలో పడే భాగానికి రూ.545.77 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ప్రణాళిక ప్రకారం.. ఈ కారిడార్ ప్రస్తుత రెడ్ లైన్‌కు పొడిగింపుగా నిర్మించనున్నారు. మరోవైపు.. ఢిల్లీ భాగానికి అయ్యే ఖర్చులో 40 శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (డిడిఎ) మిగిలిన ఖర్చుకు రూ. 1,000 కోట్లు సమకూరుస్తుంది. అయితే మూలధనంలో 37.5 శాతం ద్వైపాక్షిక / బహుపాక్షిక రుణాల నుండి వస్తుంది. ఖర్చులో 20 శాతం ఢిల్లీ ప్రభుత్వం భరిస్తుంది.
Read Also: Rajeev Chandrasekhar: ఈవీఎంలను తొలగించాలన్న ఎలాన్ మస్క్.. వ్యాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి వివరణ
మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వం 80 శాతం సబ్సిడీని అందిస్తుంది. మిగిలిన 20 శాతం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ లైన్ నిర్మాణం నాలుగేళ్లలో పూర్తవుతుందని, 26.5 కిలోమీటర్ల పొడవునా 21 స్టేషన్లు ఉంటాయన్నారు. ఇది నరేలా, బవానా మరియు అలీపూర్ ప్రాంతాలను నగరంలోని మిగిలిన ప్రాంతాలతో కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుందని.. మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని ప్రకటనలో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!