పండ్లలో రారాజు మామిడి.. అయితే మామిడి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిసిందే.. కానీ సాధారణంగా మామిడి పండు అంతా తిని.. చివర్లో పిక్క పారేస్తుంటాం..? కానీ ఆ పిక్క వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే.. ఇంకెప్పుడూ పారేయరు. మామిడిలో ఉండే అనేక పోషకాలు పిక్కలో కూడా ఉంటాయి. అవి కొలెస్ట్రాల్, డయేరియా వంటి వ్యాధులతో పోరాడగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మామిడి పిక్క ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను అందించగలదో ఇప్పుడు తెలుసుకుందాం.
Automatic Cars: సరసమైన ధరలో ఇండియాలోని టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే..
చెడు కొలెస్ట్రాల్ స్థాయిని మామిడి పిక్క నియంత్రిస్తుంది. ఈ పిక్కను పౌడర్ చేసుకుని.. తాగితే కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంతో పాటు, రక్త ప్రసరణ కూడా మెరుగవుతుంది. అంతేకాకుండా.. మామిడి పిక్క డయేరియా సమస్యను నయం చేయడంలో సహాయపడుతుంది. మామిడి పిక్కతో తయారు చేసిన పొడి అతిసారం నుండి ఉపశమనం కలిగిస్తుంది. మామిడి పిక్కను ఎండబెట్టి పొడి చేసుకుని.. ఎండుమిర్చి కలిపి తింటే డయేరియా సమస్య త్వరగా తగ్గుతుంది.
Minister Savitha: బీసీ హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి సవిత
విటమిన్లు ఏ, సీ, ఇ, పొటాషియం, మెగ్నీషియం, కాపర్, ఫోలేట్‌లు ఉంటాయి. మామిడి గింజలో మాంగిఫెరిన్ కూడా ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్లకు చాలా మంచి మూలం. యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ లాంటి ప్రమాదాల నుంచి మన కణాలను రక్షిస్తాయని పేర్కొన్నారు నిపుణులు. అలాగే గుండె సమస్యలను నియంత్రించడంలో మామిడి గింజలు కీలక పాత్ర పోషిస్తాయి. మరోవైపు.. ముఖంపై మొటిమల సమస్యను తగ్గించడంలో మామిడి సహాయపడుతుంది. దాని పొడిలో టొమాటో రసాన్ని మిక్స్ చేసి స్క్రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంలోని మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది.