James Anderson: విజయంతో కెరీర్ ముగించిన జేమ్స్ అండర్సన్..
- వెస్టిండీస్ పై ఇంగ్లండ్ ఘన విజయం
- 114 పరుగుల తేడాతో గెలుపు
- విజయంతో కెరీర్ ముగించిన జేమ్స్ అండర్సన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లార్డ్స్ టెస్టులో వెస్టిండీస్ పై ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 371 పరుగులు చేయగా.. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 136 పరుగులకు ఆలౌటైంది. తొలి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లండ్ 114 పరుగుల తేడాతో గెలిచింది. కాగా.. ఇంగ్లండ్ బౌలర్ అట్కిన్సన్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన జట్టు విజయంలో హీరోగా మారాడు. ఈ మ్యాచ్‌లో అట్కిన్సన్ మొత్తం 12 వికెట్లు పడగొట్టాడు. గస్ అట్కిన్సన్ తన అరంగేట్రం మ్యాచ్‌లోనే ఎన్నో రికార్డులు సృష్టించాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే 10 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఎనిమిదో బౌలర్‌గా నిలిచాడు. 1976 తర్వాత ఈ ఘనత సాధించిన తొలి ఇంగ్లండ్ బౌలర్‌గా నిలిచాడు.
Shabbir Ali: కేటీఆర్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ సవాల్
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ విజయంతో జేమ్స్ అండర్సన్ కెరీర్ కూడా ముగిసింది. ఈ ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్‌కి ఇదే చివరి అంతర్జాతీయ మ్యాచ్. జేమ్స్ ఆండర్సన్ కెరీర్ 22 సంవత్సరాలు కొనసాగింది. ఈ ఆటగాడు 2002లో అరంగేట్రం చేశాడు. 2003లో జింబాబ్వేపై తొలి టెస్టు ఆడాడు. అండర్సన్ తన కెరీర్‌లో 188 టెస్టులు ఆడి 704 వికెట్లు పడగొట్టాడు. టెస్టు క్రికెట్‌లో 700కు పైగా వికెట్లు తీసిన ఏకైక ఫాస్ట్ బౌలర్ అండర్సన్ నిలిచాడు. అలాగే.. వన్డేల్లో 269 వికెట్లు, టీ20ల్లో 18 వికెట్లు తీశాడు.
లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 121 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత.. బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ కు శుభారంభం లభించలేదు. అయినప్పటికీ 371 పరుగులు చేసింది. ఓపెనర్ జాక్ క్రౌలీ 89 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఒలీ పోప్ 57, జో రూట్ 68, హ్యారీ బ్రూక్ 50 పరుగులు చేశారు. తొలి టెస్టు ఆడుతున్న వికెట్ కీపర్ జామీ స్మిత్ 70 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ వెస్టిండీస్ జట్టు విఫలమైంది. కేవలం 136 పరుగులు మాత్రమే చేయగలిగింది.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?