ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో వికాస్ దూబే (24) అనే వ్యక్తి మరోసారి పాము కాటుకు గురయ్యాడు. ఏదో ఒకసారో.. రెండుసార్లు కాదు.. 40 రోజుల్లో ఏడు సార్లు పాము కాటుకు గురయ్యాడు. దీంతో.. వికాస్ దూబే తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరాడు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దూబే గురువారం సాయంత్రం తన మామ ఇంట్లో పాము కాటుకు గురయ్యాడు. కాగా.. జూన్ 2 నుంచి జూలై 6 మధ్య అతన్ని ఆరుసార్లు పాము కాటు వేసింది. తాజాగా మరోసారి పాము కాటుకు గురయ్యాడు.
Bharateeyudu 3: అసలు మ్యాటర్ అక్కడే ఉంది.. దాచాం లోపల!
దూబే పదే పదే పాముకాట్లకు గురికావడం పట్ల అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అయితే.. దూబే మొత్తం తొమ్మిది సార్లు పాము కాటుకు గురవుతాడని.. ఎనిమిదో పాము కాటు వరకు మాత్రమే బతికుతాడని చెప్పారు. తొమ్మిదవసారి కాటు వేస్తే ఏ వైద్యుడు, ‘ తాంత్రికుడు ‘ అతన్ని రక్షించలేరని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మొదటి సారి జూన్ 2వ తేదీ రాత్రి 9 గంటలకు మంచం మీది నుండి దిగుతుండగా తొలిసారి పాము కాటుకు గురయ్యాడు. ఆపై కుటుంబసభ్యులు అతడిని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ కు తీసుకెళ్లారు. దాంతో అతను 2 రోజులు అక్కడే అడ్మిట్ అయ్యాడు. ఇక చికిత్స అనంతరం కోలుకుని ఇంటికి చేరుకున్నాడు. ఇది మాములు సంఘటన అని కుటుంబ సభ్యులు భావించారు.
Anant Ambani Wedding: అంబానీ పెళ్లి ఎఫెక్ట్.. వారందరికీ వర్క్ ఫ్రం హోం..
అయితే.. పాము మరో రెండు సార్లు కాటు వేయడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. నాల్గవసారి పాముకాటు వేసిన తర్వాత.. దూబే తన ఇంటినుంచి వెళ్లి వేరే చోట ఉండమని డాక్టర్ సలహా ఇచ్చాడు. అయినప్పటికీ.. రాధానగర్‌లోని అత్త ఇంటికి వెళ్లిన అతను ఐదోసారి కాటుకు గురయ్యాడు. దీంతో దూబే తల్లిదండ్రులు అతడిని తమ ఇంటికి తీసుకొచ్చారు. జూలై 6న మరోసారి పాము దాడి చేయడంతో పరిస్థితి విషమించింది. అతడి ఆరోగ్యంపై ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించగా కోలుకుని బయటపడ్డాడు. అయితే.. పాము తనను శనివారం లేదా ఆదివారం రోజున కాటు వేస్తున్నట్లు.. కాటు వేసే ముందు తనకు తెలిసిపోతుందని దూబే ఇంతకు ముందు చెప్పాడు. ప్రస్తుతం.. దూబే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడానికి మరో 12 నుండి 24 గంటలు పడుతుందని వైద్యులు చెప్పారు.