టెస్టు క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్రపంచ రికార్డు వెస్టిండీస్ మాజీ క్రికెటర్ బ్రియాన్ లారా పేరిట ఉంది. టెస్టు క్రికెట్‌లో 400 పరుగుల మ్యాజికల్ ఫిగర్‌ను తాకిన ఏకైక బ్యాట్స్‌మెన్ బ్రియాన్ లారా. ఈ అనుభవజ్ఞుడైన కరేబియన్ క్రికెటర్.. ఈ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టగల నలుగురు క్రికెటర్లు ఎవరో చెప్పాడు. 2004లో సెయింట్ జాన్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన హోమ్ టెస్ట్ సిరీస్‌లో లారా ఈ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ డ్రాగా ముగియగా.. బ్రియాన్ లారా 400 పరుగులు చేసిన తర్వాత నాటౌట్‌గా వెనుదిరిగాడు. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లకు 751 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసినప్పుడు. లారా 400 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. లారా 582 బంతుల్లో 43 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో ఈ పరుగులు చేశాడు. లారా పేరిట ఉన్న ఈ ప్రపంచ రికార్డును శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే మాత్రమే చేరుకోగలిగాడు. 2006లో దక్షిణాఫ్రికాపై జయవర్ధనే 374 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
Read Also: Anant ambani wedding: కొత్త జంటను చూసి భావోద్వేగానికి గురైన ముఖేష్ అంబానీ
డైలీ మెయిల్ ప్రకారం.. బ్రియాన్ లారా తన ప్రపంచ రికార్డును బ్రేక్ చేసే ఆటగాళ్లు ఎవరు అని అడగ్గా.. అతను చెప్పిన పేర్లలో ఇద్దరు భారతీయ క్రికెటర్లు ఉన్నారు. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, హ్యారీ బ్రూక్, జాక్ క్రౌలీ లాంటి ఆటగాళ్లు.. తన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టగలరని లారా తెలిపాడు. అయితే.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజ బ్యాట్స్‌మెన్‌ల పేర్లను లారా చెప్పలేదు.
Read Also: Snake Bites: మరోసారి పాము కాటుకు గురైన వ్యక్తి.. 40 రోజుల్లో ఏడోసారి
లారా ప్రపంచంలోని ఆల్ టైమ్ గొప్ప బ్యాట్స్‌మెన్. అతను 131 టెస్టులు, 299 వన్డే అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. టెస్ట్ ల్లో 11953, వన్డేల్లో10405 పరుగులు చేశాడు. లారా తన కెరీర్‌లో మొత్తం 34 టెస్టులు, 19 వన్డేల్లో సెంచరీలు సాధించాడు. 55 ఏళ్ల లారా 2006లో తన కెరీర్‌లో చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. 2007లో చివరి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు.
Brian Lara backs four players to break his famous 400 record; includes two Indian stars