పిల్లలు పుట్టడంలేదని ఎందరో దంపతులు ఆసుపత్రుల చుట్టు తిరుగున్నారు. అయినప్పటికీ.. వారికి పిల్లలు పుట్టడం లేదు. వాళ్లు పిల్లలు లేరని బాధ పడుతుంటే.. కొందరు ఆడ పిల్ల పుట్టిందని చంపేయడమే, లేదంటే వేరే వారికి ఇవ్వడమో చేస్తున్నారు. ఆడపిల్ల పుడితే భారంగా చూస్తున్నారు.. ప్రస్తుత సమాజంలో ఆడా, మగా ఇద్దరు సమానంగా రాణిస్తున్నారు. కొన్ని రంగాల్లో మగవారి కంటే ఆడవారే ముందున్నారు. సమాజం ఎంతగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ కొందరిలో మార్పు రావడం లేదు. ఆడపిల్ల పుట్టడమే పాపంగా భావిస్తున్నారు. ఆడపిల్ల పుట్టిందనే కారణంతో కట్టుకున్న వారి పట్ల క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. తీవ్ర వేధింపులకు గురి చేసి, ముప్పుతిప్పలు పెడుతున్నారు. కొన్ని సార్లు హత్యలు చేసేందుకూ వెనుకాడటం లేదు.
Read Also: Donald Trump: “ట్రంప్ తల తిప్పడమే ప్రాణాల్ని కాపాడింది”.. వైరల్ వీడియో..
తాజాగా.. ఓ వ్యక్తి తనకు ఆడపిల్ల పుట్టిందని మరో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో జరిగింది. యువకుడు సిద్ధార్థ్ ప్రేమ పెళ్లి చేసుకోగా.. తనకు ఆడపిల్ల జన్మించిందని.. మరో పెళ్లి చేసుకోబోయాడు. ఒక రిసార్ట్ లో మరొక పెళ్లి రెడీ అయ్యాడు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న బాధిత మహిళ కవిత.. ఎలాగైనా పెళ్లిని ఆపుతానని తెలిపింది. ఆడబిడ్డ పుట్టిందని వేధింపులకు గురి చేస్తున్నాడని వాపోయింది. రూ. కోటి కట్నం కావాలని అత్తింటి వారు చిత్రహింసలు పెడుతున్నారని తెలిపింది. కాగా.. తనకు న్యాయం చేయాలంటూ కవిత వేడుకుంటుంది.