CM Revanth: ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని ఆంబోతుల్లా మాట్లాడుతున్నారు.. సీఎం తీవ్ర విమర్శలు
- బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
- కాంగ్రెస్ హైదరాబాద్కు ఏం చేసింది అంటున్నారు..
- 'ఔటర్ తెచ్చింది మేము.. ఐటీ తెచ్చింది మేము.. ఎయిర్ పోర్ట్ కట్టింది మేము'- రేవంత్ రెడ్డి
- మీరేం చేశారు.. గంజాయి.. డ్రగ్స్ తెచ్చారని బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. కాంగ్రెస్ హైదరాబాద్కు ఏం చేసింది అంటున్నారు.. ‘ఔటర్ తెచ్చింది మేము.. ఐటీ తెచ్చింది మేము.. ఎయిర్ పోర్ట్ కట్టింది మేము’ అని రేవంత్ రెడ్డి తెలిపారు. మీరేం చేశారు.. గంజాయి, డ్రగ్స్ తెచ్చారని బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తాము ఏదో ఒకటి చేసుకుంటూ పోతుంటే.. కాళ్ళల్ల కట్టే పెట్టే పనిలో వాళ్ళు ఉన్నారని మండిపడ్డారు. వీళ్ళ పని ఐపోయింది అన్నోడు ఎక్కడ ఉన్నాడు.. కనపడకుండా పోయాడని సీఎం విరుచుకుపడ్డారు.
Donald Trump: ట్రంప్ హత్యాయత్నంపై స్పందించిన రష్యా.. ఏం చెప్పిందంటే..
Also Read
- Ram Lakshman Masters: 'ది ప్యారడైజ్' సెట్స్‌లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
- Oracle Layoffs: ఏఐ డేటా సెంటర్ల కోసం భారీ ఖర్చు.. ఒరాకిల్‌లో మరోసారి పెద్ద ఎత్తున లేఆఫ్స్..?
- Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్‌డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
- Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
రోజూ ఎవరున్నారు.. ఎవరూ లేరు అని లెక్క పెట్టే పనిలో ఉన్నాడని బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేశారు. ఈ ప్రభుత్వాన్ని కాపాడితేనే అభివృద్ధి జరుగుతుందని ప్రకాష్ గౌడ్ లాంటి వాళ్లు కాంగ్రెస్లో చేరారని సీఎం పేర్కొన్నారు. రేవంత్ బలపడితే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని అందరూ తమ వైపు వస్తున్నారన్నారు. పార్టీలోకి వచ్చే వాళ్లకు ఏమిస్తా.. నా దగ్గర ఏముందని.. నా అంగీ లాగు అమ్మినా పైసా రాదని సీఎం తెలిపారు. ప్రకాష్ గౌడ్కి, ఎగ్గే మల్లేశంకి పైసలు తక్కువ ఉన్నాయా.. ఎగ్గె మల్లేషమే ప్రపంచ బ్యాంకుకి అప్పు ఇచ్చే స్థాయిలో ఉన్నారని అన్నారు. ఈ ప్రభుత్వాన్ని పడదోస్తామని ఇద్దరు ఆంబోతుల్లా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. మైసమ్మకి ఇచ్చిన ఆంబోతులాగా ఉన్నారు వాళ్ళని దుయ్యబట్టారు.
Donald Trump: ఈ దాడిని మరిచిపోము.. ట్రంప్ హత్యాయత్నంపై బైడెన్‌ని టార్గెట్ చేస్తున్న రిపబ్లికన్లు..
బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఈ ప్రభుత్వాన్ని పడగొడతం పడగొడతామంటున్నారు.. మీరు పడగొడతామంటే తాము నిలబెడతామంటూ ఎమ్మెల్యేలు తమ దగ్గరికి వస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం ఒకడు మూడు నెలలు.. ఇంకోడు ఆరు నెలలు కూడా ఉండదంటున్నారు.. మూడు నెలలు ఆరు నెలలు కాదు.. పదేళ్లు ఈ ప్రభుత్వాన్ని నిలబెడతామంటూ ఎమ్మెల్యేలు ముందుకు వచ్చారని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి ఏమి చేయలేనోడు.. ఆరు నెలల్లో తాము ఏం చేయలేదని మాటలు మాట్లాడుతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసిన వాళ్ళు.. ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి తెలంగాణ ప్రజల నెత్తిన మోపారన్నారు. మాటలు మాట్లాడుతున్న మొనగాళ్లు.. చేసిన అప్పులకు ప్రతినెల 7000 కోట్లు చెల్లిస్తున్నామని తెలిపారు. ఏడాదికి 72,000 కోట్లు వడ్డీకే సరిపోతుంది.. తెలంగాణ సంసారం అప్పుల పాలయిందన్నారు. ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ వస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
Ram Lakshman Masters: ‘ది ప్యారడైజ్’ సెట్స్‌లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
-
Oracle Layoffs: ఏఐ డేటా సెంటర్ల కోసం భారీ ఖర్చు.. ఒరాకిల్‌లో మరోసారి పెద్ద ఎత్తున లేఆఫ్స్..?
-
Casting Couch: ‘నువ్వు నాతో గడపాలనుకుంటే’… డైరెక్టర్ కు షరతు పెట్టిన నటి.. ఆ తరువాత ఏం జరిగిందో తెలిస్తే..
-
Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్‌డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
-
Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!