తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. వీరిని బదిలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రవాణా, హౌసింగ్ శాఖ స్పెషల్ సీఎస్ గా వికాస్‌రాజ్‌ను నియమించారు. జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా మహేష్ దత్.. ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీగా శరత్.. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ కొర్రా లక్ష్మి.. రెవెన్యూ స్పెషల్ సెక్రటరీగా హరీష్.. మేడ్చల్ మల్కాజ్‌గిరి అదనపు కలెక్టర్‌గా రాధికాగుప్తా బాధ్యతలు చేపట్టనున్నారు.
రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా స్పెషాలిటీ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత కార్డులపై నగదు రహిత సేవలను కొనసాగిస్తామని తెలంగాణ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా.. పేద, మధ్యతరగతి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు, పోలీసు సిబ్బందికి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ స్పెషాలిటీ హాస్పిటల్స్లో నగదు రహిత సేవలు అందిస్తోంది. అయితే ఆ…
హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ప్రకటించింది. ఉదయం నుంచి నగర వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. దీంతో వర్షం తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ఈ క్రమంలో.. హైదరాబాద్కు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈరోజు అర్ధరాత్రి వరకు హైదరాబాద్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో.. జీహెచ్ఎంసీతో పాటు ఇతర శాఖల అధికారులను ఐఎండీ అలర్ట్ చేసింది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్తో పాటు వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ…
ఢిల్లీలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అధికారులు హాజరయ్యారు. మీటింగ్ అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ.., నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఛైర్మన్తో సమావేశం జరిగిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై సుదీర్ఘ చర్చ జరిగిందని అన్నారు. సోమవారం రోజున మళ్ళీ ఇంజనీర్ల స్థాయిలో సమావేశం కొనసాగనుందని పేర్కొన్నారు.
సంగారెడ్డి జిల్లా బీడీఎల్ బానూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సిఐఎస్ఎఫ్ జవాన్ వెంకటేశ్వర్లు గన్ మిస్ ఫైర్ అయ్యి దుర్మరణం చెందాడు. రాత్రి విధులకు వెళ్లి ఉదయం తిరిగి వస్తుండగా సీఐఎస్ఎఫ్ వాహనంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బీడీఎల్ బానూరు పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు నంద్యాల జిల్లా అవుకు మండలం జూనూతలకు చెందినవాసిగా తెలిపారు. గతంలో ప్రధాని మోడీ భద్రత టీమ్‌లో 2 ఏళ్లు విధులు నిర్వహించాడు. కాగా.. మృతదేహాన్ని…
బీఆర్ఎస్పై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర గవర్నర్ను కలవడానికి సిగ్గుండాలని మండిపడ్డారు. అసలు గవర్నర్ వ్యవస్థపై బీఆర్ఎస్ నాయకులకు నమ్మకం ఉందా..? అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు అప్పటి గవర్నర్ను అనేక విధాలుగా కేసీఆర్ అవమానించారని తెలిపారు. అలాంటి బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు రాజ్యాంగాన్ని రక్షించాలని గవర్నర్ ఆశ్రయించడం సిగ్గు చేటు అని మండిపడ్డారు.
తెలంగాణలో రైతులకు రుణమాఫీ అవుతున్న సంగతి తెలిసిందే.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు రుణమాఫీ చేస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. అర్హులైన రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేయనుంది. మొదటగా లక్ష లోపు ఉన్నవారికి రుణమాఫీ అయింది. ఈ క్రమంలో.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన మొదట్లోనే 31 వేలకోట్ల రుణమాఫీ చేయడం దేశ చరిత్రలోనే చారిత్రాత్మకం అని అన్నారు. ఏదైనా సాంకేతిక సమస్య ఉంటే రైతు వేదికల వద్ద ఏఓ ఉంటారు.. సమస్యను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. రాజకీయ పార్టీల ఆత్రుతతో…
పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న బస్సుకు తృటిలో ప్రమాదం తప్పిన ఘటన సికింద్రాబాద్ జవహర్ నగర్ పరిధిలో చోటుచేసుకుంది. ఒక్కసారిగా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమీపంలో చెట్ల పొదల్లోకి పాఠశాల బస్సు వేగంగా దూసుకెళ్లడంతో విద్యార్థులు భయాందోళన గురయ్యారు. డంపింగ్ యార్డ్ వద్ద ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ను తప్పించే క్రమంలో రోడ్డు దాటి అదుపుతప్పి చెట్లలోకి పాఠశాల బస్సు దూసుకెళ్లింది. బస్సులో ఉన్న విద్యార్థులు భయాందోళనకు గురికాగా స్థానికులు వెంటనే అప్రమత్తమై విద్యార్థులను బస్సులో నుండి బయటకు దింపి రక్షించారు. విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం…
శంషాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు అధికారులు.. రూ. 7 కోట్లు విలువ చేసే కేజీ హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ SOT, మాదాపూర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. రాజస్థాన్ నుండి హైదరాబాద్కు హెరాయిన్ తీసుకువచ్చి విక్రయాలు జరుపుతుంది అంతర్రాష్ట్ర ముఠా. రాజస్థాన్కు చెందిన నలుగురు ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాష్ట్రంలో అదిలాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్, వరంగల్ వంటి జిల్లాల్లో పచ్చని, దట్టమైన అడవులు.. జలపాతాలు ఉన్నాయి. వాటిని గుర్తించి ఐటీ ఉద్యోగులు, జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించి ఆదాయాన్ని పెంచుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శనివారం ఆయన సచివాలయంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి పర్యాటక, సాంస్కృతిక, క్రీడా, ఎన్సీసీపై బడ్జెట్ సమీక్ష సమావేశం నిర్వహించారు.