సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మహంకాళి ఆలయ అర్చకులు మర్యాదపూర్వకంగా కలిశారు. సికింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవాలకు రావాలని సీఎంకు ఆలయ అర్చకులు ఆహ్వానం అందించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, తదితరులు ఉన్నారు.
Read Also: Gandharva mahal: వందేళ్ల ‘‘గంధర్వ మహాల్’’.. ఆచంటలో అద్భుత కట్టడం..
అనంతరం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను సచివాలయంలో ఆయన ఛాంబర్ లో కలిశారు. ఆయనకు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, జిహెచ్ఎంసి మేయర్ జీ విజయలక్ష్మి, దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఎం. హనుమంతరావు, ఆలయ ఈవో మనోహర్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు రామతీర్థ శర్మ, వేద పండితులు వేణుమాధవ్ శర్మలు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈనెల 21న ఉదయం 10 గంటలకు బోనాల ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి దర్శనార్థం మహంకాళి ఉజ్జయిని దేవాలయానికి వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
Read Also: CrowdStrike : మైక్రోసాఫ్ట్ సర్వర్లు పనిచేయకపోవడానికి కారణమైన క్రౌడ్ స్ట్రైక్ గురించి తెలుసా?