కాంగ్రెస్ ప్రాక్టికల్ పార్టీ.. కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రుణమాఫీ చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. సోనియా గాంధీ, రాహూల్ బటన్ నొక్కితే సీఎం రేవంత్ రుణమాఫీ చేశారన్నారు. సినిమాల్లో రైతుల గురించి చూపించి డబ్బులు సంపాదించిన చిరంజీవి.. నల్ల చట్టాల గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. నల్ల చట్టాలు తెచ్చిన మోడీకి మద్దతు ఇచ్చి.. రైతులకు అండగా ఉన్న రాహుల్ గాంధీకి మద్దతు ఎందుకు ఇవ్వలేదని అన్నారు. రుణమాఫీ చూసి బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు నిద్ర పట్టి ఉండదని జగ్గారెడ్డి పేర్కొన్నారు. కేటీఆర్కు ట్విట్టర్ పని తప్పా.. పనికి పనికిరాడని విమర్శించారు. మరోవైపు.. బీజేపీ దగ్గర పని తనమే లేదు.. మాటలు తప్పితే అని తీవ్ర స్థాయిలో ఆరోపించారు.
Microsoft Windows outage: గన్నవరం విమానాశ్రయం నుంచి పలు సర్వీసులు ఆలస్యం
బీజేపీ రైతులను కుని చేసి మర్డర్ చేసింది.. రైతులను నల్ల చట్టాలతో హత్య చేశారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. బీజేపీ నేతల పిల్లలు రైతుల మీద నుండి కార్లు తీసుకు పోయారు.. దీని మీద కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాట్లాడగలరా అని ప్రశ్నించారు. ఎండనక.. వాన అనక రైతులు ధర్నా చేస్త బీజేపీ నేతలు చంపలేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమా రైతుల మీద తీశారు.. రైతులు ఆత్మహత్య చేసుకోవడం పై తీశారు.. సినిమా తీసిన హీరో చిరంజీవికి, నిర్మాతకు డబ్బులు వచ్చాయన్నారు. బీజేపీ రైతులు ఆందోళన చేస్తే కాల్చి చంపిన చిరంజీవి ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు.
MP: మధ్యప్రదేశ్‌లో ఘోరం.. రన్నింగ్ కారులో తొమ్మిదో తరగతి విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్
రాహుల్ గాంధీ ప్రాక్టికల్ మనిషి.. వాస్తవాలకు దగ్గరగా ఉంటారని జగ్గారెడ్డి తెలిపారు. సోనియా గాంధీ కుటుంబంకి ఉన్న గొప్పతనం అదన్నారు. రాహుల్ గాంధీ సినిమాలో హీరోల లాగా నటించలేదు.. దేశం అంతా కాలి నడకన నడిచారని పేర్కొన్నారు. సినిమాల్లో రైతుల గురించి చేసే వాళ్ళు.. బయట మోడీకి మద్దతు ఇదేం పద్ధతి అని ప్రశ్నించారు.