వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వర్షాల వల్ల.. అదే విధంగా ఎగువ నుంచి వస్తున్న వరద వల్ల భద్రాచలంలో గోదావరి నీటిమట్టం పెరుగుతుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 42 అడుగులకు చేరుకున్నప్పటికీ.. మరి కొద్దిసేపట్లో 43 అడుగులకు చేరనుంది.
శ్రీలంక వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా కప్ 2024లో భారత్ ఘన విజయం సాధించింది. యూఏఈపై 78 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదటగా బ్యాటింగ్ చేసిన భారత్ 201 పరుగులు చేయగా.. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. యూఏఈ బ్యాటింగ్లో అత్యధికంగా కవిషా ఎగోడాగే (40*) పరుగులు చేసింది. ఆ తర్వాత ఇషా ఓజా (38) పరుగులు సాధించింది. ఖుషీ శర్మ (10) రన్స్ చేసింది. మిగత బ్యాటర్లందరూ…
ఎగువన కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరికి భారీగా వరద వస్తుంది. అయితే గోదావరి వరద ఇంకా మొదటి ప్రమాద హెచ్చరిక రాకముందే శబరి నదికి కూడా భారీగా వరద రావడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఛత్తీస్ఘడ్-ఒరిస్సా రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల శబరి నదికి 28 అడుగులకి వరద చేరుకుంది. దీంతో.. గోదావరికి పోటు ఏర్పడుతుంది. గోదావరి నుంచి దిగువకి వెళ్లే నీటి వేగం స్తంభించింది. దీంతో ఇప్పటికే భారీ వర్షాలు వల్ల పలు ప్రాంతాల్లో…
వీధి కుక్కల బారి నుండి తమను కాపాడలంటూ.. కొంపల్లి మున్సిపల్ కమిషనర్, చైర్మన్ పై ఫిర్యాదు చేసేందుకు కొంతమంది చిన్నారులు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు వచ్చారు. వారంతా.. కుత్బుల్లాపూర్లోని పలు కాలనీలకు సంబంధించిన చిన్నారులు కాగా.. రేవంత్ అంకుల్ 'మా ప్రాణాలకు భరోసా ఏది' అంటూ ప్రకార్డులతో నిరసన తెలిపారు. జంట నగరాలలో వీధి కుక్కల సమస్య తీవ్రమైంది. చిన్నారులపై వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరచి మరణానికి కారణమవుతున్నాయి.. చిన్నారులను బయటికి పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడుతున్నారు. కొంపల్లి మున్సిపాలిటీ…
ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి ముంపు పొంచి ఉందా.. యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత కూడా రామప్ప అభివృద్ధికి సరైన చర్యలు తీసుకోవడం లేదా అంటే అవుననే అంటున్నారు స్థానికులు. చిన్నపాటి వర్షానికి రామప్ప దేవాలయం పైకప్పు నుంచి నీరు కురవడమే ఎందుకు నిదర్శనం అంటున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో పెద్దవాగు ప్రాజెక్ట్ గండి పడడంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం.. ఆయకట్ట రైతులను పరామర్శించి నీట మునిగిన ఇళ్ళను సందర్శించారు. కొత్తూరు గ్రామానికి చెందిన మురళి అనే వ్యక్తి విద్యుత్ షాక్తో మృతి చెందిగా ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా.. గుమ్మడవల్లి ప్రభుత్వ కాలేజీలో అధికారులతో సమీక్షలో అన్ని శాఖల అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లాస్ పీకారు. ఇరిగేషన్ అధికారులతో ఆయన మాట్లాడుతూ.. అసలు ప్రాజెక్ట్ గేట్లు ఎందుకని ముందుగా ఎత్తలేదని…
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అధికారంతో, ఎన్నికలతో సంబంధం లేకుండా పార్టీ సంస్థాగతంగా ముందుకెళ్లే పార్టీ బీజేపీ మాత్రమేనని తెలిపారు. సిద్ధాంతపరంగా, కార్యకర్తల ఆధారంగా, ప్రజాస్వామ్యయుతంగా నడుచుకునే పార్టీ బీజేపీ అని అన్నారు. నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఘనత నరేంద్ర మోడీదని కొనియాడారు.
రిటైర్డ్ ఎంప్లాయిస్ మెడికల్ ఫెసిలిటీ స్కీం (REMFS) కింద లభించే ప్రయోజనాలను స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సంస్థ వర్తింపజేసింది. గతంలో ఉన్న నిబంధనల్లో మార్పు చేస్తూ కొత్త సర్కులర్‌ను సంస్థ జారీ చేసింది. ఈ మేరకు మార్పులు చేసిన సర్కులర్‌ను సమీక్ష సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ విడుదల చేశారు. మెడికల్ రిటైర్డ్ అయిన సిబ్బందితో పాటు కారుణ్య ఉపాధి పొందని బాధిత జీవిత భాగస్వాములూ ఈ స్కీం సభ్యత్వాన్ని పొంది ప్రయోజనాలను పొందనున్నారు.
హైదరాబాద్ బస్ భవన్లో శనివారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) పనితీరుపై రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సంస్థలోని అన్ని విభాగాల పనితీరు.. మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకం అమలు, కొత్త బస్సుల కొనుగోలు, ఆర్థికపరమైన అంశాల గురించి అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు.
మాయల గారడితో రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి అన్నారు. ఏమీ చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం సంబరాలు చేస్తున్నారు.. మూడో వంతు మందికి కూడా రుణమాఫీ చేయకుండా సంబరాలు చేసేందుకు సిగ్గుండాలి? అని దుయ్యబట్టారు. రుణమాఫీకి ఇచ్చింది రూ.6098 కోట్లు మాత్రమే ఇచ్చారు.. ఏ ప్రాతిపాదికన రుణమాఫీ చేశారు? అని మహేశ్వర రెడ్డి ప్రశ్నించారు.