317 జీవోపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. సచివాలయంలో జరిగిన ఈ భేటీలో కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో 9 ప్రభుత్వ శాఖలపై చర్చించారు. వివిధ శాఖల అధికారులు వారి శాఖల పరంగా పూర్తి సమాచారం ఇవ్వనందున యుద్ధ ప్రాతిపదికన పూర్తి సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా కమిటీ చైర్మన్ దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా.. జాతీయ రోడ్డు రవాణా, రహదారుల శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశమయ్యారు. ఆర్ఆర్ఆర్ రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అనురాగ్ జైన్కు మంత్రి తెలిపారు. అలాగే.. నల్గొండ బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని త్వరగా చేపట్టేందుకు ఎస్ఎఫ్సీ (స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ) మీటింగ్ ఏర్పాటు చేసి త్వరగా టెండర్లు పిలవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు.
మాజీ మంత్రి, బీర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వట్లేదని ఆరోపించారు. కేంద్రం నుంచి రూ.500 కోట్లు వచ్చినా విడుదల చేయట్లేదని అన్నారు. గ్రామ పంచాయతీల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. సర్పంచ్లు ఆగమయ్యాం అని తనకు వినతిపత్రం ఇస్తున్నారని తెలిపారు. ప్రతిపక్షం తట్టిలేపితే కానీ ఈ ప్రభుత్వానికి సోయి లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కనీసం గ్రామ పంచాయతీల ట్రాక్టర్లకు డీజిల్ కూడా పోయట్లేదని అన్నారు.
ములుగు జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ములుగు జిల్లా కలెక్టరేట్లో అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, అడిషనల్ కలెక్టర్, మండల ప్రత్యేక అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపిడిఓ, ఎంపిఓలతో మంత్రి రివ్యూ చేపట్టారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని తెలిపారు. ఉధృతంగా ప్రవహించే వాగులు, వంకల వద్ద సంకేత బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను…
సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. బోరు బావిలో పడి ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన మునగాల మండలం కలుకోవా గ్రామంలో చోటు చేసుకుంది. మృతుడు కొమర్రాజు లక్ష్మయ్య అనే రైతుగా గుర్తించారు. బోరు బావిలో మోటార్ను దించేందుకు లోపలి దిగడంతో ప్రమాదవశాత్తు ఊపిరి అందక మృతి చెందాడు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు.. సంఘటన స్థలానికి చేరుకొని జేసీబీ సహాయంతో మృతదేహాన్ని బయటకు తీసే పనిలో నిమగ్నమయ్యారు.
హైదరాబాద్ అత్తాపూర్లోని అక్బర్ హిల్స్లో ల్యాండ్ కబ్జాకు పాల్పడ్డారు. 9 మంది రౌడీ షీటర్ల ను అరెస్ట్ చేసిన సైబరాబాద్ ఎస్.ఓ.టి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా నగర శివారు ప్రాంతాలలో భూ కబ్జాలకు పాల్పడుతూ యాజమానులను బెదిరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కిడ్నాపైన ఎమ్మార్పీస్ నాయకుడు కేసులో వీరి పాత్ర ఉంది. వారి వద్ద నుంచి ఒక తుపాకీ తల్వార్లు, ఇనుప రాడ్లు స్వాధీనం చేసుకున్నారు.
మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు, పరీక్షలు, కమిషన్ విచారణ తదితర అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ, రాష్ట్ర నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సమావేశమయ్యారు.
హైదరాబాద్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన సనత్నగర్ జెక్ కాలనీలోని ఆకృతి రెసిడెన్సీ అపార్ట్మెంట్ రెండవ అంతస్తులో చోటు చేసుకుంది. 204 ఫ్లాట్లో విద్యుదాఘాతంతో ముగ్గురు కుటుంబ సభ్యులు మృతి చెందారు. ఇంట్లోని బాత్రూంలో పడి ఉన్న మృతదేహాలను సాయంత్రం కాలనీవాసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే.. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. హైదరాబాద్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుత్…
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. మహారాష్ట్ర, ఛత్తీస్ఘడ్, ఒడిస్సా రాష్ట్రాల నుంచి వస్తున్న వరదలతో తెలంగాణ ఎగువన వున్న వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. దీంతో ఎగువ నుంచి కాళేశ్వరం, మేడిగడ్డ, తుపాకుల గూడెంతో పాటు ఛత్తీస్ఘడ్ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి పెరిగింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకుంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ క్రమంలో లోతట్టు…
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇరిగేషన్ పై అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు అధికారులు పాల్గొన్నారు. నిన్న డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ అధికారులు సమావేశమయ్యారు. రేపు మరోసారి డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులతో తెలంగాణ ఇరిగేషన్ అధికారులు, ఇంజనీర్లు సమావేశం కానున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు.