IND-W vs UAE-W: యూఏఈపై ఇండియా ఘన విజయం.. సెమీస్కు భారత్
- యూఏఈపై భారత్ ఘన విజయం
- 78 పరుగుల తేడాతో గెలుపు
- ఆసియా కప్లో వరుసగా భారత్కు రెండో విజయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంక వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా కప్ 2024లో భారత్ ఘన విజయం సాధించింది. యూఏఈపై 78 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదటగా బ్యాటింగ్ చేసిన భారత్ 201 పరుగులు చేయగా.. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. యూఏఈ బ్యాటింగ్లో అత్యధికంగా కవిషా ఎగోడాగే (40*) పరుగులు చేసింది. ఆ తర్వాత ఇషా ఓజా (38) పరుగులు సాధించింది. ఖుషీ శర్మ (10) రన్స్ చేసింది. మిగత బ్యాటర్లందరూ కేవలం సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. భారత బౌలర్లు సమిష్టిగా రాణించడంతో జట్టు విజయం సాధించింది. భారత్ బౌలర్లలో దీప్తి శర్మ 2 వికెట్లు తీసింది. ఆ తర్వాత రేణుకా సింగ్, తనుజా కన్వార్, పూజా వస్త్రాకర్, రాధ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు.. 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో షెఫాలీ వర్మ (37), స్మృతి మంధాన (13) పరుగులు చేసి జట్టుకు శుభారంభం అందించారు. ఆ తర్వాత దయాళన్ హేమలత (2) పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టింది. తర్వాత హర్మన్‌ప్రీత్ కౌర్ (66), రిచా ఘోష్ (64) పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడి భారత్ స్కోరును పెంచారు. హర్మన్ ప్రీత్ ఇన్నింగ్స్లో 7 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. రిచా ఇన్నింగ్స్లో 12 ఫోర్లు, ఒక సిక్స్ ఉంది. ఆ తర్వాత.. జెమీమా రోడ్రిగ్స్ (14) పరుగులు చేయడంతో భారత్ 201 పరుగుల భారీ స్కోరు చేసింది. యూఏఈ బౌలర్లలో కవిషా 2 వికెట్లు పడగొట్టింది. సమైరా, హీనా చెరో వికెట్ తీశారు. కాగా.. భారత్ ఈ మ్యాచ్ విజయంతో సెమీఫైనల్కు చేరుకుంటుంది.
Read Also: Viral Video: అసలు ఎలా వస్తయో ఇలాంటి ఐడియాలు.. మీరూ ట్రై చేస్తే పోలా..
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!