బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిపక్ష హోదాలో మొదటిసారి అసెంబ్లీకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత, ఫాంహౌస్ కే పరిమితమైన కేసీఆర్.. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు అసెంబ్లీకి రానున్నట్లు సమాచారం. ఈనెల 24వ తేదీన (బుధవారం) తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో ఆ రోజు కేసీఆర్ అసెంబ్లీకి రానున్నారు.
అధికారులతో సీఎస్ శాంతికుమారి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. మరో మూడు రోజుల పాటు వర్షాలు ఉన్న క్రమంలో.. జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జిల్లాల్లో ఏ విధమైన ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా కలుగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు. ముందుగానే పునరావాస కేంద్రాల ఏర్పాటు పై చర్యలు తీసుకోవాలని.. పోలీస్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, అగ్నిమాపక శాఖ, NDRF, SDRF తదితర శాఖలతో సమన్వయంతో పనిచేయాలని…
రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిల సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.., కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలైన రాహుల్ గాంధీ, ప్రియంక గాంధీలను కలిశామని తెలిపారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తున్న అంశాలను వివరించామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ, గ్యాస్ సబ్సిడీ, ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ చేసిన అంశాలపై అగ్రనేతలకు వివరించామని చెప్పారు.
పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి రూ. 25 వేల పింఛన్ అందించనుంది. అందుకు సంబంధించి సర్కార్ జీవో జారీ చేసింది. కనుమరుగు అవుతున్న కళలు గుర్తించి, వాటిని భవిష్యత్తు తరాలకు అందించే కళాకారులను ప్రోత్సహించేందుకు సీఎం రేంవత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న 1654 గెస్ట్ లెక్చరర్ల ఉద్యోగ భద్రత, గౌరవ వేతనాల పెంపు విషయమై ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్ర వెంకటేశంను ఆదేశించారు.
రెండో విడత పంట రుణమాఫీపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. సాధ్యమైనంత త్వరగా అమలు చేయుటకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రుణమాఫీ 2024లో మొదటి విడతగా రూ. లక్ష లోపు రుణాలకు సంబంధించి 11.50 లక్షల కుటుంబాలకు 6098.94 కోట్ల రూపాయలు విడుదల చేశామన్నారు.
సైబరాబాద్ పరిధిలో ల్యాండ్ కబ్జాలకు పాల్పడుతున్న భూ కబ్జాదారులపై బుల్డోజర్స్తో పోలీసులు యాక్షన్లోకి దిగారు. మొదటిసారి అక్రమార్కులపై బుల్డోజర్స్ అస్త్రాన్ని ప్రయోగించారు. గండిపేటలో ఓ డాక్టర్ స్థలంను కబ్జా చేసి బెదిరింపులకు పాల్పడ్డారు కబ్జాదారులు. ఈ స్థల వివాదంలో ఎమ్మార్పీఎస్ నేత నరేందర్ తో పాటు మరొకరిని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన ఎమ్మార్పీఎస్ నేతను శంషాబాద్ లోని ఫామ్ హౌస్ లో పెట్టి హింసించారు. అంతేకాకుండా.. 20 కుక్కలు, పొట్టేళ్ల మధ్యలో నరేందర్ను చిత్రహింసలకు గురిచేశారు భూకబ్జాదారులు. ఈ క్రమంలో.. అసాంఘీక కార్యక్రమాలకు…
జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌కు సహకరించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరంలోని మురికి నీరు అంతా మూసీలో చేరుతోందని, దానిని శుద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో.. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. దీంతో.. అధికారులు అప్రమత్తమయ్యారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత నదికి భారీగా వరద పోటెత్తింది. తీరం వద్ద 12.300 మీటర్ల ఎత్తులో పుష్కర ఘాట్ మెట్లను వరద ముంచెత్తింది. జాగ్రత్త పడ్డ అధికారులు భక్తుల పుణ్యస్నానాలను నిలిపివేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం మీద ఆరోపణలు మానుకోవాలని సూచించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద నోరు పారేసుకోకు అని అన్నారు. కాళేశ్వరంలో లక్ష కోట్లు సముద్రం పాలు చేసిన ఘనత బీఆర్ఎస్ది అని దుయ్యబట్టారు. సన్నాయి నొక్కులు నొక్కడం మానుకో హరీష్ రావు అని విమర్శించారు. మేడిగడ్డలో కుంగిన బ్లాకులు మీరు ఎందుకు రిపేర్ చేయలేదని ప్రశ్నించారు. హరీష్ స్థాయి తగ్గించుకుంటున్నాడని మండిపడ్డారు.