ఉత్తరాఖండ్లో ఓ అమాయక చిన్నారిని చిరుత బలి తీసుకుంది. తన ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల బాలికపై దాడి చేసి చంపి తిన్నది. ఈ ఘటన జరిగిన మూడు గంటల తర్వాత ఇంటికి 30 మీటర్ల దూరంలోని పొదల్లో సగం తిన్న బాలిక మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళన నెలకొంది. దీంతో.. ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురై.. దానిని మట్టుబెట్టేందుకు చూస్తున్నారు.
తమిళనాడు పోలీసులు ఆరుగురు రష్యా పౌరులను అరెస్ట్ చేశారు. కుడంకుళం వద్ద ఉన్న న్యూక్లియర్ రియాక్టర్ ప్లాంట్ దగ్గర నుంచి ఆరుగురు రష్యన్ పౌరులు, ముగ్గురు భారతీయులను అదుపులోకి తీసుకున్నారు. న్యూక్లియర్ రియాక్టర్ పరిసరాల్లో విదేశీయులు ఉన్నారని స్థానిక ప్రజలు సమాచారం ఇవ్వడంతో సోమవారం సాయంత్రం వారిని అదుపులోకి తీసుకున్నట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు IANSకి తెలిపారు.
మూడు టీ20ల అంతర్జాతీయ సిరీస్ కోసం టీమిండియా శ్రీలంక చేరుకుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు జూలై 22న శ్రీలంకకు చేరుకుంది. ఈ క్రమంలో.. ఈరోజు నుంచి భారత జట్టు ప్రాక్టీస్ సెషన్‌లను ప్రారంభించింది. ఇదిలా ఉంటే.. టీమిండియా కొత్త ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌కి ఇది మొదటి అసైన్‌మెంట్. అలాగే.. టీ20 కెప్టెన్‌గా పూర్తి బాధ్యతలు చేపట్టిన సూర్యకుమార్ యాదవ్కు కూడా ఇది మొదటి టూర్. టీమ్ ఇండియా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 టైటిల్‌ను గెలుచుకున్న సంగతి…
విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.3 కోట్లు వసూలు చేశారు దంపతుల జంట. ఈ ఘటన మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా ఉరాన్‌లో చోటు చేసుకుంది. ఓ సంస్థను కలిగి ఉన్న దంపతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. విదేశాల్లో చదువు, ఉద్యోగం ఇప్పిస్తానని ఓ డాక్టర్‌తో పాటు అతని కుటుంబసభ్యులను రూ.3 కోట్లకు పైగా మోసం చేశారన్న ఆరోపణలు వీరిపై ఉన్నాయి.
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆటోమొబైల్ రంగంలో కస్టమ్స్ సుంకం నుండి పూర్తి మినహాయింపు ఇవ్వాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. ఎలక్ట్రిక్ వెహికల్ (EV) పరిశ్రమతో సహా అనేక రంగాలకు లిథియం కీలకమైన భాగం. అంతేకాకుండా.. రాగి, కోబాల్ట్.. అరుదైన భూమి మూలకాలపై కూడా మినహాయింపు ప్రతిపాదించారు. ఇంకా.. ఈ మెటీరియల్‌లలో బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (BCD)ని తగ్గించాలని ఆర్థికమంత్రి సూచించారు. ఆర్థిక మంత్రి చేసిన ఈ ప్రకటనతో ఎలక్ట్రికల్ వెహికల్స్ (EV)లు చౌకగా మారవచ్చు.…
సాఫ్ట్వేర్ ఉద్యోగి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. మృతుడు సంగారెడ్డి జిల్లాకు చెందిన కిరణ్గా గుర్తించారు పోలీసులు. అతను విప్రో కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇంట్లో సమస్యలతో డిప్రెషన్లో ఉరేసుకొని ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది.
రోహన్ బోపన్న తన కెరీర్‌లో 35 ఏళ్ల తర్వాత భారీ విజయాలను అందుకున్నాడు. ప్రస్తుతం బోపన్న వయసు 44 ఏళ్లు. అయినప్పటికీ.. అతను విజయాల్లో దూసుకుపోతున్నాడు. గత సంవత్సరం బోపన్న.. మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకుని గ్రాండ్‌స్లామ్ గెలిచిన ఎక్కువ వయస్సున్న టెన్నిస్ ఆటగాడిగా నిలిచాడు. ఇప్పుడు బోపన్న కళ్లు పారిస్ ఒలింపిక్స్‌పై పడ్డాయి. అయితే.. తాను తన రెగ్యులర్ భాగస్వామి మాథ్యూ ఎబ్డెన్‌తో కాకుండా ఎన్. శ్రీరామ్ బాలాజీతో రంగంలోకి దిగబోతున్నాడు.
గ్రూప్-1లో స్పోర్ట్స్ కోటా కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25న వెరిఫికేషన్ చేయనుంది. 25న రాలేని వారికి 27న అవకాశం కల్పిస్తుంది. గ్రూప్-1 సర్వీస్‌లలో స్పోర్ట్స్ రిజర్వేషన్‌ను క్లెయిమ్ చేస్తున్న అభ్యర్థులకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయనుంది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. గుర్తింపు పొందిన ఆటలు/క్రీడలలో (ఫారమ్-1), ఒక అంతర్జాతీయ పోటీ/మల్టీ నేషనల్ పోటీలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన అభ్యర్థులు మాత్రమే గ్రూప్ - 1…
ఈరోజు సాయంత్రం బీజేఎల్పీ సమావేశం నిర్వహించారు. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ భేటీ నిర్వహించారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన శాసనసభ పక్ష సమావేశం జరిగింది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం, ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు.
గుర్తు తెలియని మహిళ పుర్రె లభ్యమైన సంఘటన మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని అత్వెల్లి గ్రామంలోని నార్నే ఎస్టేట్లో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి పుర్రె, వెంట్రుకలు, చీర, బ్లౌజ్, చేతి సంచి, ఒక చెప్పు కనపడింది. దీంతో వెంటనే స్థానిక మేడ్చల్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మేడ్చల్ సీఐ అద్దాని సత్యనారాయణ, సబ్ ఇన్స్పెక్టర్ మురళీధర్ లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.