బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం మీద ఆరోపణలు మానుకోవాలని సూచించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద నోరు పారేసుకోకు అని అన్నారు. కాళేశ్వరంలో లక్ష కోట్లు సముద్రం పాలు చేసిన ఘనత బీఆర్ఎస్ది అని దుయ్యబట్టారు. సన్నాయి నొక్కులు నొక్కడం మానుకో హరీష్ రావు అని విమర్శించారు. మేడిగడ్డలో కుంగిన బ్లాకులు మీరు ఎందుకు రిపేర్ చేయలేదని ప్రశ్నించారు. హరీష్ స్థాయి తగ్గించుకుంటున్నాడని మండిపడ్డారు.
Read Also: Prabhas: ప్రభాస్ సరసన పాకిస్తానీ భామ.. ఇదే ప్రూఫ్!
కుంగిన ప్రాజెక్టు, పిల్లర్ల గురించి ఎన్నడూ మాట్లాడని కేటీఆర్.. హరీష్ లు ఇప్పుడు మాట్లాడుతున్నారని బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. ఆరడుగుల హరీష్కి మెదడు తలలో ఉందా.. మోకాలులోకి వచ్చిందా..? తీవ్ర స్థాయిలో విమర్శించారు. NDSA ఓ వైపు హెచ్చరిస్తుంటే.. మళ్ళీ తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వారం రోజుల్లో 73 టీఎంసీల నీళ్లు సముద్రం పాలైంది.. దీని పాపం మీది కాదా..! అని అన్నారు.
Read Also: YSRCP: వైసీపీకి మరో షాక్.. పార్టీకి మాజీ ఎమ్మెల్యే గుడ్‌బై..
రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి.. దమ్ముంటే అక్కడికి వచ్చి మాట్లాడండని బీర్ల ఐలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు రైతులను ఎలా మోసం చేశారు.. సబ్సిడీలు ఎలా రద్దు చేశారు అనేది చర్చ చేద్దామన్నారు. గవర్నర్ వ్యవస్థ అంటేనే గౌరవం లేని మీరు గవర్నర్ నీ కలిశారని బీర్ల ఐలయ్య తెలిపారు.