బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిపక్ష హోదాలో మొదటిసారి అసెంబ్లీకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత, ఫాంహౌస్ కే పరిమితమైన కేసీఆర్.. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు అసెంబ్లీకి రానున్నట్లు సమాచారం. ఈనెల 24వ తేదీన (బుధవారం) తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో ఆ రోజు కేసీఆర్ అసెంబ్లీకి రానున్నారు. బడ్జెట్ సమావేశంలో పాల్గొనాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో.. ప్రతిపక్ష నేతగా మొదటిసారిగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు గులాబీ బాస్..
Read Also: Tharun Sudhir Marriage : జైల్లో దర్శన్.. పెళ్ళికి రెడీ అయిన డైరెక్టర్-హీరోయిన్!
మరోవైపు.. రేపు ఉదయం 10 గంటలకు గన్ పార్క్లోని అమరవీరుల స్థూపనికి నివాళులు అర్పించనున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అనంతరం 11 గంటలకు శాసససభకు హాజరుకానున్నారు. అనంతరం.. మధ్యాహ్నం 1 గంటకు బీఆర్ఎస్ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరుగనుంది. ఈ భేటీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించనున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ వైఫల్యం, చేనేత కార్మికుల ఆత్మహత్యలపై అసెంబ్లీలో చర్చించనుంది. ఆరు గ్యారెంటీలు, రైతు రుణమాఫీ, ఫీజు రీయింబర్సుమెంట్స్, పారిశుద్ధ్యంపై అసెంబ్లీలో బీఆర్ఎస్ చర్చించనుంది.
Read Also: Budget 2024: మంగళవారం నిర్మలమ్మ బడ్జెట్ విశేషాలు ఇవే!