CM Revanth: రాహుల్ గాంధీతో ముగిసిన రేవంత్ రెడ్డి భేటీ.. ఏం చర్చించారంటే..?
- రాహుల్ గాంధీతో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి భేటీ
- భేటీలో డిప్యూటీ సీఎం భట్టి.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తున్న అంశాలను వివరించాం- భట్టి
- మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
- .. 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ..
- గ్యాస్ సబ్సిడీ.. ఉచిత కరెంటు.. రైతు రుణమాఫీ చేసిన అంశాలపై అగ్రనేతలకు వివరించాం- భట్టి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిల సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.., కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలైన రాహుల్ గాంధీ, ప్రియంక గాంధీలను కలిశామని తెలిపారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తున్న అంశాలను వివరించామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ, గ్యాస్ సబ్సిడీ, ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ చేసిన అంశాలపై అగ్రనేతలకు వివరించామని చెప్పారు. అంతేకాకుండా.. తెలంగాణకు రావాలని కోరామని భట్టి విక్రమార్క చెప్పారు. భవిష్యత్తులో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను కలిసి తెలంగాణ పీసీసీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశామని డిప్యూటీ సీఎం తెలిపారు.
UP: చెవుల్లో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని ట్రాక్‌పై నడక.. రైలు ఢీకొని ఇద్దరు మృతి
Also Read
- Virat Kohli - Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Polavaram Hydel Project: పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలక ముందడుగు..
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి బిజీబిజీగా గడపుతున్నారు. పలువురు కేంద్రమంత్రులను కలుస్తూ.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చలు జరుపుతున్నారు. ఇవాళ ఉదయం కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాల పై సోనియా గాంధీతో చర్చించారు. రైతులకు మొదటి విడతలో చేసిన రుణమాఫీ అంశాన్ని సోనియాగాంధీ కి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క వివరించారు.
Read Also: Padma Shri Awardees: పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు రూ.25 వేల పింఛన్.. జీవో జారీ
ఇదిలా ఉంటే.. ఇంతకుముందు కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌కు సహకరించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరంలోని మురికి నీరు అంతా మూసీలో చేరుతోందని, దానిని శుద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని కేంద్ర మంత్రికి తెలిపారు. అంతేకాకుండా.. జాతీయ నది పరిరక్షణ ప్రణాళిక కింద మూసీలో మురికి నీటి శుద్ధి పనులకు రూ.4 వేల కోట్లు.. గోదావరి నది జలాలను ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లతో నింపే పనులకు రూ.6 వేల కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌ను ముఖ్యమంత్రి కోరారు.
తాజావార్తలు
-
Virat Kohli – Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
-
Matrubhoomi: నవంబర్ 13న మాతృభూమి రిలీజ్ సాధ్యమా?
-
British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
-
Polavaram Hydel Project: పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలక ముందడుగు..
-
BSNL Freedom 2.0: జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూపాయికే సిమ్‌తో పాటు బంపర్ ఆఫర్లు!
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!