Landslides: మహారాష్ట్రలో కొండచరియలు విరిగిపడి ఒకరు మృతి.. శిథిలాల కింద మరికొందరు
- పూణెలోని లావాసా నగరంలో విరిగిపడ్డ కొండచరియలు
- కూలిపోయిన 3 ఇళ్లు
- ఓ యువకుడు మృతి.. శిథిలాల కింద చిక్కుకున్న ఇద్దరు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పూణెలోని లావాసా నగరంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మూడు ఇళ్లు కూలిపోయాయి. అంతేకాకుండా.. ఓ యువకుడు మృతి చెందాడు. కాగా కొండచరియలు విరిగిపడిన శిథిలాల కింద ఇద్దరు చిక్కుకున్నారు. వర్షం కారణంగా పూణె, థానేలో వరదలు పొంగిపొర్లుతున్నాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.. డ్యామ్‌లలో నీటిమట్టం పెరిగింది. వర్షం కారణంగా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో.. ప్రభుత్వం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ప్రజలను రక్షించే పనిలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిరంతరం నిమగ్నమై ఉన్నాయి.
మహారాష్ట్రలోని థానే జిల్లాలో వర్షం ప్రజల ఇబ్బందులను పెంచింది. జిల్లాలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఐదు గంటల్లో 135 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 142.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గురువారం అంబర్‌నాథ్‌తో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అంబర్‌నాథ్‌లోని సాహ్వాస్ వృద్ధాశ్రమంలోని 18 మంది పెద్దలను మహర్ వృద్ధాశ్రమంలోని పై అంతస్తుకు తరలించారు. సత్కర్మ ఆశ్రమానికి చెందిన 30 మంది పిల్లలను ప్రగతి అంధుల పాఠశాలకు పంపారు. అంతే కాకుండా.. 200 మందిని BSUP భవనంలోకి తీసుకువెళ్లారు. 40 కుటుంబాలకు చెందిన 156 మందిని కళ్యాణ్ నుండి తరలించారు.
Also Read
PM Modi: శుక్రవారం లడఖ్‌లో మోడీ పర్యటన.. షింకున్ లా టన్నెల్ ప్రాజెక్ట్ ప్రారంభం
భారీ వర్షాల కారణంగా కళ్యాణ్ జిల్లాలోని బద్లాపూర్ బ్యారేజీ, జంబుల్ డ్యామ్, మోహనే డ్యామ్, ఉల్లాస్ నదిలో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో.. మోహనే, వరప్, వల్ధుని, కళ్యాణ్, అనే, భిసోల్, రైటే, ఆప్తి, దహగావ్, మంఝర్లీ, అంబర్‌నాథ్‌లోని బద్లాపూర్, ఇరంజాద్, కుద్సర్వే, కన్హేరే, కస్గావ్, ఉల్హాస్‌నగర్‌కు చెందిన షాహద్, మహరల్, భివాండికి చెందిన డైవ్ అగర్, రాజనోలి గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు.. తాంసా డ్యాంలో నీటిమట్టం 99.18 శాతానికి చేరుకోవడంతో చుట్టుపక్కల గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించారు. వరదల ధాటికి భివాండి, షాపూర్‌లలో ఐదు ఇళ్లు దెబ్బతిన్నాయి.
కళ్యాణ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా.. రుండే, రైతే వంతెనలపై రాకపోకలు నిలిచిపోయాయి. నది ఒడ్డున నివసించే ప్రజలను అప్రమత్తం చేశారు. అంతే కాకుండా.. చిక్లి వంతెన మునిగిపోవడంతో కళ్యాణ్-ముర్బాద్ రోడ్, ముర్బాద్-సహాపూర్ రోడ్‌లు మూసివేశారు. సహాయక చర్యల కోసం అధికారులు థానేలో రెండు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను మోహరించారు. కొండచరియలు విరిగిపడిన శిథిలాలలో చిక్కుకున్న యువకుల కోసం ఎన్డీఆర్ఎఫ్ వెతుకుతోంది.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!