Haryana: ఉద్యోగం కోసం రష్యా వెళ్లి.. యుద్ధంలో ప్రాణాలు పొగొట్టుకున్న భారతీయ యువకుడు
- ఉక్రెయిన్‌లో మృతి చెందిన భారతీయ యువకుడు
- రష్యా తరపున ఉక్రెయిన్‌లో యుద్ధం చేసి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి
- ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన రవి మౌన్
- యువకుడికి కొన్ని రోజులు శిక్షణ ఇచ్చి..
- ఉక్రెయిన్‌కు ఫ్రంట్‌లైన్ వర్కర్‌గా పంపించిన అక్కడి అధికారులు
- యుద్ధంలో పోరాడుతూ యువకుడు మృతి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానాకు చెందిన 22 ఏళ్ల యువకుడు ఉక్రెయిన్‌లో మరణించాడు. రష్యా తరపున ఉక్రెయిన్‌లో యుద్ధం చేసి ప్రాణాలు కోల్పోయాడు. ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన తన తమ్ముడిని బలవంతంగా సైన్యంలోకి చేర్చుకున్నారని మృతుడి సోదరుడు చెబుతున్నాడు. యువకుడికి కొన్ని రోజుల శిక్షణ ఇచ్చిన తర్వాత.. ఉక్రెయిన్‌కు ఫ్రంట్‌లైన్ వర్కర్‌గా పంపించారు. అక్కడ ఆ యువకుడు పోరాడుతూ మరణించాడు. యువకుడి మృతిని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది.
Also Read
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
- Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
ఉక్రెయిన్ యుద్ధంలో హతమైన యువకుడిని రవి మౌన్‌గా గుర్తించారు. అతని స్వస్థలం హర్యానా రాష్ట్రం కైతాల్ జిల్లాలోని మాటౌర్ గ్రామ నివాసి. రవి జనవరి 13న రవాణా ఉద్యోగం కోసం రష్యా వెళ్లాడని, అయితే ఆర్మీలో రిక్రూట్ అయ్యాడని రవి సోదరుడు అజయ్ పేర్కొన్నాడు. కాగా.. తన సోదరుడి గురించి సమాచారం ఇవ్వాలని అజయ్ జూలై 21న రాయబార కార్యాలయానికి లేఖ రాశాడు. అయితే.. తన సోదరుడు మరణించినట్లు రాయబార కార్యాలయం తమకు తెలియజేసిందని చెప్పాడు. మృతదేహాన్ని గుర్తించడానికి డీఎన్‌ఎ పరీక్ష నివేదికను కూడా పంపాలని రాయబార కార్యాలయం కోరిందని ఆయన చెప్పారు. రవి తమతో చివరిసారిగా మార్చి 12న మాట్లాడాడని సోదరుడు అజయ్ తెలిపాడు. మరోవైపు.. అజయ్ మౌన్ తన సోదరుడి మృతదేహాన్ని తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోడీని అభ్యర్థించారు. అతని మృతదేహాన్ని తీసుకురావడానికి తమ వద్ద తగినంత డబ్బు లేదని.. ఎకరం భూమిని అమ్మి రష్యాకు పంపడానికి కుటుంబం రూ.11.50 లక్షలు ఖర్చు చేసిందని చెప్పారు.
Read Also: Nandamuri Mokshagna: నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్?
ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల రష్యా పర్యటన తర్వాత.. పుతిన్ ప్రభుత్వం తన సైన్యంలో పనిచేస్తున్న భారతీయ పౌరులను వెంటనే విడుదల చేసి, తిరిగి వచ్చేలా చూడాలని భారతదేశం చేసిన డిమాండ్‌ను అంగీకరించింది. అంతలోనే రవి మరణ వార్త బయటకు వచ్చింది. రష్యా తన సైన్యంలో సహాయక సిబ్బందిగా భారతీయులను నియమించుకోవడాన్ని నిలిపివేయాలని.. దళంలో పనిచేస్తున్న భారతీయులను స్వదేశానికి రప్పించాలని భారతదేశం చేసిన డిమాండ్‌ను అంగీకరించడానికి రష్యా ఈ నెల ప్రారంభంలో అంగీకరించింది. రష్యన్ సైన్యం నుండి భారతీయ పౌరులందరినీ త్వరగా పంపిస్తామని రష్యా తెలిపింది.
తాజావార్తలు
-
WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
-
Virat Kohli – Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
-
Matrubhoomi: నవంబర్ 13న మాతృభూమి రిలీజ్ సాధ్యమా?
-
British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
-
Polavaram Hydel Project: పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలక ముందడుగు..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!