Chandrababu: గత ప్రభుత్వం జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాల పై సీఎం ట్వీట్..
- గత ప్రభుత్వం జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్
- పాస్ పుస్తకాలపై తన బొమ్మవేసుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడిన గత పాలకుడి తప్పుల్ని సరిదిద్దుతున్నాం..
- తాత తండ్రుల నుంచి వచ్చిన ఆస్తులపై ఎవరి బొమ్మా ఉండకూడదనేది ప్రజాభిప్రాయం..
- ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు జారీ చేస్తాం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ప్రభుత్వం జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాల పై ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. ‘పాస్ పుస్తకాలపై తన బొమ్మవేసుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడిన గత పాలకుడి తప్పుల్ని సరిదిద్దుతున్నామన్నారు. తాత తండ్రుల నుంచి వచ్చిన ఆస్తులపై ఎవరి బొమ్మ ఉండకూడదనేది ప్రజాభిప్రాయం.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు జారీ చేస్తామని తెలిపారు. నాటి అహంకార, పెత్తందారీ పోకడలు ప్రజాప్రభుత్వంలో ఉండవు. ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడి వారి ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యతను మా ప్రభుత్వం తీసుకుంటుంది.’ ముఖ్యమంత్రి ట్విట్టర్లో పేర్కొన్నారు.
Read Also: Mamata Banerjee: బెంగాల్ విభజన, కొత్త కేంద్రపాలిత ప్రాంతాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించం..
Also Read
- Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
- Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
కాగా.. ఈరోజు సీఎం చంద్రబాబు రెవెన్యూపై సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్షలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో రాజముద్రతో భూ యజమానులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజల పాసు పుస్తకాలపై తన బొమ్మల కోసం రూ.15 కోట్లు తగలేశారంటూ జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు, ప్రజల కోరిక మేరకు రాజముద్రతో కొత్త పాసు పుస్తకాలు ఇచ్చేందుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకోనుంది. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆస్తి వివరాలు, ఆ ఆస్తి అడ్రస్ వద్దకు తీసుకువెళ్లే మ్యాప్ కూడా వచ్చేలా ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. మాజీ సీఎం జగన్ బొమ్మ ఉన్న 77 లక్షల గ్రానైట్ రాళ్లను ఏమి చేయాలి అనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆ రాళ్లపై బొమ్మలు చెరపడానికి మరో రూ.15 కోట్లు ఖర్చు అవుతుందని తాత్కాలిక అంచనా వేసింది. జగన్ మోహన్ రెడ్డి బొమ్మల పిచ్చి వల్ల మొత్తంగా రూ.700 కోట్ల వరకు ప్రజా సొమ్ము వృధా అయిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆ గ్రానైట్ రాళ్లను ఎలా ఉపయోగించుకోవచ్చు.. వాటితో ఏం చెయ్యవచ్చో చూడమని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం ఇచ్చారు.

Read Also: Agnipath: అగ్నిపథ్‌పై లోక్‌సభలో రగడ.. రాహుల్-రాజ్‌నాథ్ మధ్య మాటల యుద్ధం
తాజావార్తలు
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
-
Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
-
Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?