పారిస్ ఒలింపిక్స్ లో మరో భారత ఆటగాడు పతకం సాధించడంలో దగ్గర్లో ఉన్నారు. 50 మీటర్ రైఫిల్ 3 పాజిషన్స్ ఈవెంట్ లో స్వప్నిల్ కుసాలే ఫైనల్ చేరారు. 590 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచారు. కాగా.. రేపు మధ్యాహ్నం 1 గంటలకు ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి టాప్-3లో నిలిస్తే భారత్ ఖాతాలో మరో పతకం చేరుతుంది. కాగా.. 3 పొజిషన్ షూటింగ్ అంటే పడుకుని, మోకాళ్లపై కూర్చుని, నిలబడి షూట్ చేయడం.
Read Also: Love Proposal Video: వాటే లవ్ ప్రపోజల్.. ప్రేమ కోసం అమ్మాయి మోకరిల్లింది! ఇలాంటివి నా లైఫ్‌లో కూడా..
మరోవైపు.. ఒలింపిక్స్ మహిళల సింగిల్స్ గ్రూప్ దశలో సింధు వరుసగా రెండో మ్యాచ్‌లో విజయం సాధించి ప్రీక్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. ఎస్టోనియాకు చెందిన క్రిస్టీన్ కుబాను 21-5, 21-10 తేడాతో ఓడించి నాకౌట్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్ 34 నిమిషాల పాటు సాగింది. సింధు తొలి గేమ్‌ను 14 నిమిషాల్లో, రెండో గేమ్‌ను 19 నిమిషాల్లోనే గెలుచుకుంది. దీంతో పీవీ సింధు రౌండ్ -16 (ప్రీ క్వార్టర్స్)కు చేరుకున్నారు.
Read Also: Tollywood: ఒక క్లిక్..ముగ్గురు స్టార్ హీరోల లేటెస్ట్ అప్‌డేట్స్..
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడు బ్యాడ్మింటన్ పతకాలు సాధించే అవకాశం ఉందని.. ఇందులో సింధు హ్యాట్రిక్ పతకాలు సాధిస్తుందని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, టాప్ షట్లర్ పీవీ సింధు మెంటర్ ప్రకాష్ పదుకొనే అభిప్రాయపడ్డారు. భారతదేశం ఏడుగురు సభ్యుల బ్యాడ్మింటన్ జట్టును ఒలింపిక్స్ ను పంపింది. ఇందులో పురుషుల డబుల్స్ జంట సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి, ఒలింపిక్ పతక విజేత సింధు ఉన్నారు. పారిస్‌లో వరుసగా మూడో ఒలింపిక్ పతకం కోసం సింధు తీవ్రంగా శ్రమిస్తోందని, మంచి ప్రదర్శన చేస్తుందని పదుకొణె తెలిపారు.