Car Servicing: కారు సర్వీస్‌కు ముందు, తర్వాత ఈ విషయాలను గుర్తుంచుకోండి.. లేదంటే..?
- కారు సర్వీసింగ్ చేయడానికి ముందు.. తర్వాత ఈ విషయాలు గుర్తుంచుకోండి
- కారును సర్వీసింగ్ కు ఇస్తున్నప్పుడు మంచి కంపెనీ ఇంజన్ ఆయిల్ నింపించుకోవాలి
- సర్వీసింగ్ కు ముందు కారు ఓడోమీటర్ రీడింగ్‌ను చెక్ చేయండి
- మీ కారును కంపెనీ సర్వీస్ సెంటర్ లోనే సర్వీస్ చేయించుకోవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీరు కొత్త కారుని కొనుగోలు చేస్తే.. దాని సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి సర్వీసింగ్ అనేది అవసరం. మీరు కారును సరిగ్గా నిర్వహించకపోతే దాని పనితీరు తగ్గుతుంది. ఈ క్రమంలో.. కారు చెడిపోయే ప్రమాదం ఉంటుంది. చాలా మంది కార్ డ్రైవర్‌లు తమ కారును సమయానికి సర్వీస్ చేయడం చాలా అరుదు. మీరు కూడా ఇలాంటి పొరపాటు చేస్తే.. మానుకోండి. తద్వారా కారు సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం పడదు. కారును సర్వీసింగ్ చేయడానికి ముందు.. తర్వాత గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Read Also: Tech News: ‘ఆండ్రాయిడ్ రికవరీ మోడ్’ అంటే ఏంటి.. ఫోన్లో సమస్యలను ఎలా పరిష్కరించవచ్చు…?
Also Read
మీ కారును సర్వీస్ చేసే ముందు ఈ విషయాలపై శ్రద్ధ వహించండి
మీరు మీ కారును సర్వీసింగ్ కోసం తీసుకెళ్లాలని చూస్తున్నట్లయితే.. ముందుగా కారు ఇంజిన్‌లో ఏ ఇంజన్ ఆయిల్ నింపాలి వంటి కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. సర్వీసింగ్ కు ముందు కారు ఓడోమీటర్ రీడింగ్‌ను చెక్ చేయండి. తద్వారా సర్వీసింగ్ సమయంలో ఎటువంటి సమస్య ఉండదు. సర్వీసింగ్ విషయంలో కారు కొనుగోలుదారులకు కారు గురించి పెద్దగా తెలియదు. అలాంటప్పుడు.. కారు పదివేల కిలోమీటర్లు డ్రైవింగ్ చేసిన తర్వాత మాత్రమే సర్వీస్ చేస్తారని సమాచారం తెలుసుకోవాలి. తరచుగా ప్రజలు కారు సర్వీసింగ్ కోసం వెళతారు.. కానీ కారుతో సమస్య ఏమిటో వారికి తెలియదు. అటువంటి పరిస్థితిలో మీరు కారు ఎదుర్కొంటున్న సమస్యలను ముందుగానే గుర్తించాలి.
మీ కారు సర్వీస్ చేసిన తర్వాత ఈ విషయాలను గుర్తుంచుకోండి
మీ కారును కంపెనీ సర్వీస్ సెంటర్ లోనే సర్వీస్ చేయించుకోవాలి. మీరు మీ కారుని వేరేక చోట సర్వీస్ చేస్తే.. సర్వీస్ తర్వాత ఒకసారి సర్వీస్ బిల్లును చెక్ చేసుకోండి. చాలా మంది వ్యక్తులు సర్వీసింగ్ పేరుతో అదనపు ఛార్జీని వసూలు చేస్తారు. అలాగే.. కారు సర్వీసింగ్ తర్వాత మీరు గుర్తుంచుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కారు నుండి ఎటువంటి పరికరాలు.. ఏదైనా టూల్ కనిపించకుండా పోయిందా అనేది చూడాలి. ఒకవేళ ఏదైనా మిస్ అయితే మెకానిక్ లేదా సర్వీస్ సెంటర్‌లో ఉన్న వారితో మాట్లాడి సమస్యను తీర్చుకోవాలి. కారు సర్వీసింగ్ చేసిన తర్వాత.. వెంటనే కారును తీసుకెళ్లి డ్రైవ్ చేస్తారు. అలా కాకుండా.. సర్వీసింగ్ అయిన వెంటనే అక్కడే ఉండి కారులో ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది చెక్ చేసుకోవాలి.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?