Kerala: వయనాడ్ ఘటనలో 122 చేరిన మృతుల సంఖ్య..
- వయనాడ్‌లో ఘటనలో 122 చేరినా మృతుల సంఖ్య
- కేరళలోని ఎనిమిది జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసినా వాతావరణశాఖ
- నిండు కుండలా మారిన డ్యాంలు.. ప్రాజెక్టులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళలోని వయనాడ్ జిల్లాలోని మెప్పాడి సమీపంలోని కొండ ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రకృతి విపత్తు కారణంగా ఇప్పటివరకు 122 మంది చనిపోయారు. అలాగే 142 తీవ్రగాయాలతో ఉన్న వారిని రెస్క్యూ టీం అధికారులు కాపాడారు. మరోవైపు.. ముండకై తేయాకు పరిశ్రమలో పనిచేస్తూ గల్లంతైన 600 మంది కార్మికుల కోసం ఆర్మీ అధికారులు గాలిస్తున్నారు. వారంతా అస్సాం, పశ్చిమబెంగాల్ నుండి వచ్చి తేయాకు తేటలో పనిచేస్తున్నారు. వయనాడ్లో భారీ ప్రళయం ధాటికి ‘టీ ఎస్టేట్’ పూర్తిగా కొట్టుకు పోయింది.
Read Also: Jio Plans: జియో 3 కొత్త చౌకైన ప్లాన్‌లు.. అపరిమిత కాలింగ్, డేటాతో పాటు ఓటీటీలు కూడా..
Also Read
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
వయనాడ్‌కు విపత్తు సహాయ బృందాన్ని పంపింది. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన నేపథ్యంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ జిల్లా ప్రధాన కార్యాలయం (కేరళ, మాహే).. ఇండియన్ కోస్ట్ గార్డ్ స్టేషన్ బేపూర్ విపత్తు సహాయ బృందాన్ని పంపాయి. విపత్తులో ప్రభావితమైన వారికి సహాయం అందించడానికి వీరు అక్కడికి వెళ్లారు. ఈ బృందంలో అత్యంత శిక్షణ పొందిన ICG సిబ్బంది.. ప్రత్యేక వైద్య బృందం ఉంటుంది. ఈ బృందం అవసరమైన విపత్తు సహాయక సామగ్రిని కలిగి ఉంది. ఇందులో రెస్క్యూ ఆపరేషన్‌ల కోసం రబ్బరు పడవలు, నీరు.. డ్రైనేజీ సమస్యలను నిర్వహించడానికి డీజిల్‌తో నడిచే పంపులు, భద్రత కోసం లైఫ్ జాకెట్లు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సిబ్బందిని రక్షించడానికి రెయిన్‌కోట్లు.. గమ్ బూట్‌లు, మట్టిని తొలగించే పరికరాలు అందుబాటులో ఉన్నాయి .
Read Also: Amalapuram: ఆన్లైన్లో బెట్టింగ్ గేమ్ నిర్వహిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు..!
మరోవైపు.. వాయనాడ్‌లో భారీ కొండచరియలు విరిగిపడి పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం జూలై 30, 31న రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. అంతేకాకుండా.. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, వేడుకలను వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. కేరళలోని ఎనిమిది జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. వయనాడ్, కోజికోడ్, మల్లాపురం, ఒపాలక్కాడ్, ఇడిక్కి సహా ఎనిమిది జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది. కేరళలో భారీ వర్షాల ధాటికి డ్యాంలు, ప్రాజెక్టులు నిండు కుండలా మారిపోయాయి.
తాజావార్తలు
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!