మన వంటగదిలో అల్లం వెల్లుల్లి వాడకం సర్వసాధారణం. అల్లం వెల్లుల్లి లేకుండా ఏ కూరను తయారు చేయలేము. మరీ ముఖ్యంగా నాన్ వెజ్ కర్రీస్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే.. రుచికరంగా ఉంటుంది. అంతేకాకుండా.. అల్లం వెల్లుల్లి వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అయితే.. అల్లం వెల్లుల్లిని వంటకాల్లో వాడేందుకు ముందుగానే తీసుకుని నిల్వ ఉంచుకుంటారు. అయితే.. అధిక వేడి కారణంగా పాడవడం, ఎండిపోవడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో డబ్బులు వృథా కాకుండా ఉండేందుకు అవసరమైన మేరకు అల్లం, వెల్లుల్లి కొనుగోలు చేస్తారు. అయితే.. అల్లం వెల్లుల్లి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఈ చిట్కాలు పాటిస్తే.. ఎక్కువ కాలం నిల్వ చేసుకోవచ్చు. ఇంతకీ అవెంటో తెలుసుకుందాం..
Prajavani: ప్రజావాణిలో ఇప్పటివరకు 5,23,940 దరఖాస్తులు.. 4,31,348 పరిష్కారం
పొట్టు తీసిన అల్లంను గాలి వెళ్లని సంచిలో ఉంచాలి. లేదంటే రిఫ్రిజిరేటర్‌లో ఉంచండి. గాలి వెళ్లని బ్యాగ్ లో పెడితే తేమ, ఆక్సిజన్ వెళ్లక అల్లం పాడైపోదు. వేసవిలో ఎక్కువగా అల్లం బూజు పడుతుంది. అల్లంను గాలి వెళ్లని బ్యాగ్‌లో ఉంచి రిఫ్రిజిరేటర్‌లో నిల్వ ఉంచడం ద్వారా అల్లం రెండు నెలల పాటు నిల్వ ఉంటుంది.
వెల్లుల్లిని 6 నెలల పాటు నిల్వ చేయవచ్చు. అయితే.. వెల్లుల్లిని కొనేటప్పుడు అది మొలకెత్తిందా లేదా చూసుకోవాలి. అలాంటప్పుడు వెల్లుల్లి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. వెల్లుల్లిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి.. బ్యాగులు, కవర్లలో ప్యాక్ చేయవద్దు.
Khushi kapoor: చెల్లి కూడా నందమూరి హీరోతోనే టాలీవుడ్ ఎంట్రీ?
అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు పాడవకుండా నిల్వ ఉంచాలంటే.. ఉప్పు లేదా నూనే వేయాలి. ఆ తర్వాత.. ఆ పేస్ట్ ను ఫ్రిజ్ లో పెట్టుకోవడం వల్ల కనీసం రెండు వారాలు నిల్వ ఉంటుంది. అలాగే.. వెనిగర్ ను కూడా కలుపుకుంటే.. అల్లం వెల్లుల్లి పేస్ట్ పాడైపోదు. దీంతో.. కలర్ మారకుండా, రుచి ప్రభావితం కాకుండా ఉంటుంది.