వివాదాస్పద సంఘటన తర్వాత రెజ్లర్ అంతిమ్ పంఘల్ ఓ వీడియోను విడుదల చేసింది. తన అక్రిడిటేషన్ రద్దు గురించి సమాచారం ఇచ్చింది. తన సోదరిని ఒలింపిక్ క్యాంపస్లోకి ప్రవేశించడానికి తన అక్రిడిటేషన్‌ను ఉపయోగించినట్లు చెప్పింది. కాగా.. మహిళల ఫ్రీస్టైల్ 53 కేజీల తొలి రౌండ్‌లో అంతిమ్ పంఘల్ తొలి మ్యాచ్ లో 0-10తో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత తన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించిందని అంతిమ్ పంఘల్ చెప్పింది.
Bomb Making: యూట్యూబ్ చూసి బాంబులు తయారు చేసిన పిల్లలు..చివరకి.?
అనంతరం.. ఆ తరువాత ఆమె తన కోచ్‌లు వికాస్, భగత్ సింగ్ ఉంటున్న హోటల్‌కు వెళ్లింది. తన వస్తువులు కొన్ని క్రీడా గ్రామంలో ఉన్నట్లు సోదరి నిశాకు చెప్పి, తీసుకురమ్మంటూ కోరింది. అందుకోసం తన అక్రిడిటేషన్ కార్డును ఇచ్చింది. అయితే, నిశా క్రీడా గ్రామంలోకి వెళ్లి వస్తువులను తీసుకొని వస్తుండగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఆమె నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్నారు. అనంతరం అంతిమ్‌ను కూడా పిలిపించి వివరణ కూడా అడిగారు. ఆ తరువాత అంతిమ్ అక్రిడిటేషన్ దుర్వినియోగం అయినట్లు భావించిన ఒలింపిక్ నిర్వాహకులు.. రద్దు చేశారు. మరోవైపు.. తన సోదరిని వెరిఫికేషన్ కోసం పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారని.. ఆ సమయంలో తాను పోలీస్ స్టేషన్కు వెళ్లలేదని అంతిమ్ పంఘల్ చెప్పింది. అదేవిధంగా పారిస్‌లో క్యాబ్లో ప్రయాణించి డబ్బులు చెల్లించలేదంటూ అంతిమ్ వ్యక్తిగత సిబ్బందిపై కూడా అక్కడి పోలీసులకు ఆ క్యాబ్ డ్రైవర్ ఫిర్యాదు చేశాడు.
Tamil Nadu: తమిళనాడు దేవాలయం హోర్డింగ్‌పై పోర్న్ స్టార్ మియా ఖలీఫా ఫోటో..
ఈ ఘటనపై స్పందించిన అంతిమ్ పంఘాల్.. భాష సమస్య కారణంగా క్యాబ్ డ్రైవర్‌తో వాగ్వాదం జరిగిందని చెప్పారు. తనపై ఎలాంటి పుకార్లు వ్యాప్తి చేయవద్దని, తన పరిస్థితిని అర్థం చేసుకోవాలని మీడియాకు.. ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
nnis Exclusive: ANTIM PANGHAL CLEARS THE AIR FROM PARIS!
➡️ On facing deportation for allegedly trying to ‘smuggle’ her sister into the Games Village.
➡️ Taken into police custody.
➡️ Her coach refused to pay the cab driver and misbehaved.
She asks everyone not to spread… pic.twitter.com/Nopxe8UDlC
— nnis Sports (@nnis_sports) August 8, 2024