ఆహాలో ప్రసారం కానున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 తదుపరి ఎపిసోడ్‌లో నేచురల్ స్టార్ నాని అలరించనున్నారు. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 యొక్క 18వ మరియు 19వ ఎపిసోడ్‌లలో ఎంతో ఇష్టపడే నేచురల్ స్టార్ నాని కనిపించబోతున్నారు.
స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ “భారతీయుడు 2”. దర్శకుడు శంకర్ చాలా హైప్ తెచ్చి రిలీజ్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన మేర ఆకట్టుకోలేక పోయింది. అంతే కాదు సినిమా చూసిన ప్రేక్షకులు చాలా మంది ట్రోల్ చేసేలా ఉందంటే పరిస్థితి ఇక ఉందో అర్థం చేసుకోవచ్చు. గత నెలలో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్‌గా నిలిచింది. ఈ చిత్రం కమర్షియల్‌గా విఫలం కావడమే కాకుండా.. శంకర్ ఓల్డ్ స్కూల్ ఆలోచనలపై భారీ…
సుంకిశాల ప్రాజెక్టు విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఎటాక్ చేశారు. సుంకిశాలకు సంబంధించిన ఘటనలో పొరపాటును ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి.. కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎదురుదాడి చేయడం సరికాదని అన్నారు. సుంకిశాల ఘటనతో కృష్ణా నదిపై బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల నాణ్యత పై విచారణ చేయిస్తామని తెలిపారు.
నల్గొండ జిల్లాలో మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా.. సుంకిశాల ప్రాజెక్టును మంత్రులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సందర్శించారు. కూలిన రిటైనింగ్ సైడ్వాల్ను పరిశీలించారు. నీట మునిగిన ఇన్టెక్ వెల్, పంపింగ్ స్టేషన్ను మంత్రులు పరిశీలించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రఖ్యాత అడోబ్ సిస్టమ్స్ (Adobe Systems) సీఈవో శంతను నారాయణ్‌తో భేటీ అయ్యారు. ఫ్యూచర్ స్టేట్ తెలంగాణకు పెట్టుబడులు లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి.. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని పలువురు గ్లోబల్ బిజినెస్ లీడర్లతో సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు.
మూడో విడత రుణమాఫీపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రైతులకు శుభవార్త చెప్పారు. ఆగస్ట్ 15న మూడో విడత రుణమాఫీ చేస్తామని ఈరోజు తెలిపారు. వైరాలో జరిగే సభలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ పాల్గొంటారని అన్నారు. ఖమ్మం జిల్లా వైరా నుంచే రుణ మాఫీ జరుగనుంది.. ఇది రైతుల అదృష్టమని భట్టి విక్రమార్క చెప్పారు. ప్రతిపక్షాల నాయకులు అంతా కూడా భ్రమల్లో ఉండి పోయారని ఆరోపించారు.
సంగారెడ్డి జిల్లా గుమ్మదిదల మండలం దోమడుగు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఓ యువకుడు ఇన్స్టా గ్రామ్లో ప్రేమ పేరుతో యువతిని వేధింపులకు గురి చేశాడు. దీంతో.. ఆకతాయి వేధింపులు భరించలేక యువతి తేజస్విని ఆత్మహత్య చేసుకుంది. తేజస్విని బీ.ఫార్మసీ చదువుతోంది. తన ఇంటివద్ద నాలుగో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ క్రమంలో.. వెంటనే గమనించిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో యువతి మృతి చెందింది.
ఉత్తర్ ప్రదేశ్ మహిళలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుభవార్త చెప్పారు. ఆగస్టు 19న రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సోదరీమణులకు గిఫ్ట్ ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం రాష్ట్రంలోని శాంతిభద్రతలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను సీనియర్ ప్రభుత్వ స్థాయి అధికారుల సమక్షంలో జోన్, డివిజన్, రేంజ్ మరియు జిల్లా స్థాయిలో ముఖ్యమైన పోస్టులపై నియమించిన అధికారులతో సమీక్షించారు.
పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత పురుషుల హాకీ జట్టుతో ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్‌లో మాట్లాడారు. జట్టు విజయం సాధించినందుకు మోడీ అభినందనలు తెలిపారు. జట్టు అనుభవజ్ఞుడైన గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్‌కు ప్రత్యేక విజ్ఞప్తి కూడా చేశారు. శ్రీజేష్‌కి ఇదే చివరి మ్యాచ్ కావడంతో అంతర్జాతీయ హాకీకి వీడ్కోలు పలికాడు.
యూపీ పోలీసుల ఓ సిగ్గుమాలిన చర్య వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సబ్-ఇన్‌స్పెక్టర్ ఒక మహిళను చెంపదెబ్బ కొట్టడం కనిపిస్తుంది. అంతేకాకుండా.. తన వద్ద ఉన్న పిస్టల్ తీసి భయపెట్టాడు. కాగా.. ఈ వీడియో వైరల్ కావడంతో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేసి దర్యాప్తుకు ఆదేశించారు.