అధిక బరువు కారణంగా ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ పై అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే.. కాగా.. ఈ నిర్ణయాన్ని సవాల్ చేసిన వినేశ్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS) కోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై ఈరోజు రాత్రి 9:30 గంటలలోపు తీర్పు వెలువడే అవకావం ఉంది.
ఎంజీఎంలో దారుణం చోటు చేసుకుంది. నాలుగు రోజుల పసి గుడ్డును కుక్కలు పిక్కోని తింటున్న దృశ్యం దర్శనమిచ్చింది. ఈ ఘటన ఎక్కడో ఆస్పత్రి ఆవరణలోని మూల ప్రాంతంలో కాదు.. అందరూ తిరుగుతుండే క్యాజువాలిటీ ముందు కనిపించింది. అయితే.. ఈ పసికందును కుక్కలు ఎక్కడి నుంచి తీసుకుని వచ్చాయనే వివరాలను ఆస్పత్రి అధికారులు, పోలీసులు సేకరిస్తున్నారు. పసికందు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
తెలుగు రాష్ట్రాలలో అతిపెద్ద వస్త్ర వ్యాపార సంస్థ సి.ఎం.ఆర్ గ్రూప్ తమ 32వ షాపింగ్ మాల్ను కరీంనగర్లోని మార్కెట్ రోడ్ లో శుక్రవారం ఉదయం 9.38 గం.కు భూంరెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా చలిమెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆచలిమెడ లక్ష్మీ నరసింహరావు, డా. వి. సూర్యనారాయణ రెడ్డి. డా. భూంరెడ్డి హాస్పిటల్స్, డా. వి. రమాదేవి, మొదటి కొనుగోలుదారు చిదుర సురేష్, తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఓ అవినీతి తిమింగలం బయటపడింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై రెవెన్యూ ఆఫీసర్ నరేందర్ ఇంట్లో ఈరోజు ఉదయం నుంచి ఏసీబీ సోదాలు చేపట్టారు. మొత్తంగా రూ.6.7 కోట్ల విలువైన ఆస్తులను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు.
ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్స్‌కు చేరిన వినేశ్ ఫొగాట్‌కు.. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మద్దతుగా నిలిచారు. ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్కు చేరిన వినేశ్.. అదనపు బరువు కారణంగా పతకానికి దూరమైంది. ఈ క్రమంలో.. వినేశ్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS) కోర్టును ఆశ్రయించారు. కాగా.. ఈ అంశంపై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించారు. రజత పతకానికి వినేశ్ ఫొగాట్ అర్హురాలేనని అన్నారు.
నీటి పారుదల ప్రాజెక్టులలో పూడిక తీత అంశంపై సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ కొనసాగుతుంది. ఈ సమావేశంలో ఉపసంఘం సభ్యులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎక్సయిజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పై కేటీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా వెళ్ళింది ఆయన తమ్ముడి కంపెనీ కోసం అని కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని.. కేటీఆర్ గతంలో అమెరికా వెళ్ళినప్పుడు ఏం చేశారో, ఎటువంటి ఒప్పందాలు చేసుకున్నారో తెలుసన్నారు. పదేళ్లు బీఆర్ఎస్ నేతలు పందికొక్కుల్ల దోచుకుతిన్నారని మండిపడ్డారు.
క్రికెటర్ మహ్మద్ సిరాజ్కు తెలంగాణ ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించింది. జూబ్లీహిల్స్‌లో 600చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తూ.. ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. టీ20 ప్రపంచకప్ భారత్ జట్టు టైటిల్ సాధించిన సంగతి తెలిసిందే.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు రజత పతకం సాధించిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాతో ప్రధాని మోడీ శుక్రవారం ఫోన్లో మాట్లాడారు. అంతేకాకుండా.. నీరజ్ చోప్రాను అభినందించారు.. అతని గాయం గురించి అప్‌డేట్ తీసుకున్నారు. ఈ సందర్భంగా.. నీరజ్ తల్లి క్రీడా స్ఫూర్తిని కూడా ప్రధాని ప్రశంసించారు.
అమెరికాలోనే అతి పెద్ద బయో టెక్నాలజీ కంపెనీ ఆమ్జెన్ (AMGEN) తెలంగాణలో కార్యకలాపాలను విస్తరించనుంది. హైదరాబాద్లో కొత్తగా రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ విభాగం ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. హైటెక్ సిటీలో ఆరు అంతస్తుల భవనంలో ఈ సెంటర్ ఉంటుంది. దాదాపు 3 వేల మందికి ఇక్కడ ఉద్యోగాలు లభిస్తాయి. ఈ ఏడాది చివరి త్రైమాసికం నుంచే కంపెనీ తమ కార్యకలాపాలు ప్రారంభించనుంది. సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆమ్జెన్ ఆర్ అండ్ డీ కేంద్రంలో…