Paris Olympics 2024: భారత్ ఖాతాలో మరో పతకం..
- పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టు
- స్పెయిన్ పై 2-1 తేడాతో విక్టరీ
- భారత్ ఖాతాలో మొత్తం 4 కాంస్య పతకాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పారిస్ ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు బంగారు పతకం గెలుస్తుందని చాలా అంచనాలు ఉండేవి. అది నిజం చేశారు.. స్వర్ణం సాధించలేకపోయినప్పటికీ, భారత జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. కాంస్య పతక పోరులో భారత్ 2-1తో స్పెయిన్‌ను ఓడించింది. అంతకుముందు సెమీస్‌లో జర్మనీ చేతిలో భారత్ 3-2 తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఒలింపిక్స్‌లో భారత్ అత్యధిక విజయాలు సాధించిన క్రీడ హాకీ. హాకీలో భారత్ ఇప్పటి వరకు ఎనిమిది స్వర్ణాలు, ఒక రజతం, నాలుగు కాంస్య పతకాలతో మొత్తం 13 పతకాలు సాధించింది.
Pawan Kalyan: సినీ హీరోలపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి నాదెండ్ల
Also Read
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
2020 లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు 5-4తో జర్మనీని ఓడించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో భారత పురుషుల హాకీ జట్టు ఒలింపిక్ క్రీడల్లో 41 ఏళ్ల తర్వాత పతకం సాధించింది. 1980లో మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన తర్వాత ఇది మొదటిది. హాకీలో భారత్‌కు ఇది మూడో కాంస్య పతకం. ఈసారి పురుషుల జట్టు పతకం రంగు మార్చేందుకు ప్రయత్నించినా కుదరలేదు. గ్రూప్ దశ నుంచి ఇప్పటి వరకు భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసింది.
Kangana ranaut: కంగనా రనౌత్‌కు కాంగ్రెస్ షాక్.. రూ.40 కోట్ల పరువు నష్టం దావా
గ్రూప్ దశలో భారత్ పూల్ బిలో నిలిచింది. ఐదు మ్యాచ్‌ల్లో మూడింటిలో గెలిచిన భారత జట్టు.. తన గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచింది. ఈ సమయంలో ఒక మ్యాచ్ డ్రా కాగా, ఒక మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఓడిపోయింది. గ్రూప్ దశలో బెల్జియంపైనే టీమ్ ఇండియా ఓటమి పాలైంది. మరోవైపు.. ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్ కు వచ్చిన భారత్.. బ్రిటన్‌ను ఓడించింది. కాగా.. సెమీ ఫైనల్లో భారత జట్టు జర్మనీ చేతిలో ఓడిపోయింది. ఇదిలాఉంటే.. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మొత్తం 4 కాంస్య పతకాలు చేరాయి.
తాజావార్తలు
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!